ముద్రా రుణాలకు వడ్డీ రాయితీ.. అడవుల పరిరక్షణకు కొత్త పథకం!

Update: 2020-05-14 13:52 GMT
nirmala sitharaman press meet

ప్రధాని మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల భారీ ఆర్ధిక ప్యాకేజీ ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా ఈరోజు మరిన్ని రంగాలకు ఇచ్చే వేసులుబాట్లను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతరామన్ ప్రకటించారు.

ముద్రా రుణాలకు వడ్డీ రాయితీ..

- ముద్ర పథకం కింద ₹50 వేలలోపు చిన్నరుణాలు తీసుకున్నవారికి వడ్డీ రాయితీ ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

- మారటోరియం అనంతరం ముద్ర రుణాలపై రెండు శాతం వడ్డీ రాయితీ ఉంటుంది.

- వీధి వ్యాపారులకు రుణ సదుపాయం కల్పిస్టారు.

- 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ₹5 వేల కోట్ల రుణ సాయం.

- ఒక్కొక్కరికీ ₹10 వేలు చొప్పున వర్కింగ్‌ కేపిటల్‌ కింద రుణం మంజూరు చేస్తారు.

- మధ్య ఆదాయ వర్గాలకు గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకం మరో ఏడాది పొడిగిస్తారు. ₹6 లక్షల నుంచి ₹18 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది.

అడవుల పరిరక్షణ కోసం 'క్యాంపా'

- అడవుల పరిరక్షణ, మొక్కలు నాటేందుకు నూతన పథకం తీసుకువస్తున్నారు.

- ఆరు వేల కోట్లతో గిరిజనులకు ఉపాధి కల్పించేలా 'క్యాంపా' పథకం ఉంటుంది.

- దీని ద్వారా గిరిజనులకు నగదు అందుబాటులోకి వస్తుంది. పథకం అమలు రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణపై ఆధారపడి ఉంటుంది.


Tags:    

Similar News