Delhi violence: భాదితులకి నష్టపరిహారం ప్రకటించిన కేజ్రీవాల్‌

దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టంపై చెలరేగిన అల్లర్లలో మరణించిన వారి కుటుంబాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పరిహారం ప్రకటించారు.

Update: 2020-02-27 12:54 GMT
Arvind Kejriwal (File Photo)

దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టంపై చెలరేగిన అల్లర్లలో మరణించిన వారి కుటుంబాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పరిహారం ప్రకటించారు.. ఇందులో మరణించిన వారికి వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు రూపాయలు, గాయపడిన వారికి రూ. 5 లక్షలు, చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, శాశ్వత వైకల్యం కలిగితే రూ. 5 లక్షలు, అనాథలుగా మిగిలిన వారికి: రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్లు అయన పేర్కొన్నారు.

ఇక ఇళ్ళు పూర్తిగా కాలిపోయిన వారికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు అందజేస్తామని, వాటిలో అద్దెకు ఉండే వాళ్లకు రూ. 1 లక్ష చొప్పున నష్టపరిహారం అందిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ఇక పెంపుడు జంతువులు కోల్పోయిన వారికి రూ. 5 వేలు(ఒక్కో దానికి), రిక్షా ధ్వంసమైతే: రూ. 25 వేలు నష్టపరిహారం ఇస్తామని అన్నారు. అంతేకాకుండా అల్లర్లలో గాయపడిన మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరిన వారి చికిత్స ఖర్చులను డీల్లీ ప్రభుత్వం భరిస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా కేజ్రివాల్ మాట్లాడుతూ.. ఈ ఘటనకి పాల్పడిన వారిలో దోషులుగా తేలితే వారికి కఠినమైన శిక్ష విధించాలని, అందులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కు చెందినవారైతే జరిమానాను రెట్టింపు చేయాలని ఆయన అన్నారు. జాతీయ భద్రత విషయంలో రాజకీయాలు ఉండకూడదని కేజ్రివాల్ అభిప్రాయపడ్డారు.

ఇక ఈ అల్లర్లలో మరణించిన వారి సంఖ్య గురువారం నాటికి 35 కి పెరిగింది. గురు తేగ్ బహదూర్ (జిటిబి) ఆసుపత్రిలో 30, ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో రెండు, జగ్ పర్వేశ్ చంద్ర ఆసుపత్రిలో ఒకరు మరణించినట్లు జిటిబి ఆసుపత్రి అధికారులు తెలిపారు. సోమవారం జరిగిన ఘర్షణల్లో ఢిల్లీ పోలీసు హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో కానిస్టేబుల్ కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం నాటికి మరణించిన వారి సంఖ్య 27 ఉండగా తాజాగా అది 35 కు పెరిగింది.

Tags:    

Similar News