అరుణ్ జైట్లీ : విద్యార్ధి దశ నుండి కేంద్రమంత్రి వరకు ...

Update: 2019-08-24 08:11 GMT

బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ (66) కన్నుమూశారు. గత కొద్ది కాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన డీల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. గతంలో అయన అమెరికాకి వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుని వచ్చారు. కానీ ఈనెల 9న మరోసారి అరుణ్ జైట్లీకి శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబసభ్యులు జైట్లీని హుటాహుటినా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. కొన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్సకి సహకరించారు. కానీ శనివారం అయన మరణించారు ...

విద్యార్ధి దశ నుండి కేంద్రమంత్రి వరకు ...

అరుణ్ జైట్లీ నవంబర్ 28, 1952న కొత్తఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. ఇతని తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ ప్రముఖ న్యాయవాది. అరుణ్ జైట్లీ ఢిల్లీ నుంచే డిగ్రీ మరియు న్యాయశాస్త్ర పట్టా పొందినారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అభ్యసిస్తున్నప్పుడు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించారు. విద్యార్థి దశలోనే అరుణ్ జైట్లీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేశారు. అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ (ఇప్పటి భారతీయ జనతా పార్టీ) లో చేరారు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రి హయంలో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 1991 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో పనిచేస్తున్నారు.

వాజ్ పేయ్ హయంలో కేంద్రమంత్రి...

అరుణ్ జైట్లీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేబినెట్ హోదా గల మంత్రిగా నియమించబడ్డారు. పలు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా వ్యవహరించారు. ఆయన 2009 నుండి 2014 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేసారు . 2014 సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి పోటీపడి... కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు

2019 ఎన్నికలకి దూరం ....

2014లో మోడీ మొదటి క్యాబినెట్ లో ఆర్ధిక శాఖా మంత్రిగా పని చేసారు అరుణ్ జైట్లీ .. అంతకుముందు రక్షణ మరియు వాణిజ్య శాఖా మంత్రిగా పనిచేసారు . కానీ 2019 ఎన్నికల్లో అయన ఆరోగ్య కారణాల చేత ఎన్నికలకు దూరంగా ఉంటూ వచ్చారు ...  

Tags:    

Similar News