లఢక్‌లో తీవ్ర విషాదం.. ఆరుగురు సైనికుల మృతి

Update: 2019-11-19 04:07 GMT

లఢక్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సియాచిన్‌‌లోని ఆర్మీ బేస్‌పై మంచు చరియలు విరిగిపడటంతో ఆరుగురు సైనికులు మృతిచెందారు. ఈ ఘటన సముద్ర మట్టానికి 18వేల అడుగుల ఎత్తులో ఉన్న హిమానీనదం వద్ద జరిగింది. మంచు చరియలు విరిగి పడటంతో నలుగురు సైనికులు, ఇద్దరు పోర్టర్లు చలికి తట్టుకోలేక మరణించినట్టు ఇండియన్ ఆర్మీ అధికారికంగా వెల్లడించింది. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఉత్తర హిమానీనదంలో ఆర్మీ స్థానానికి హిమపాతం తగిలిందని.. దాంతో ఈ ఘోరం సంభవించిందని.. ఆర్మీ దళాలు వెంటనే రెస్క్యూ ఆపరేషన్లను ప్రారంభించాయన్నారు. ఆ సమయంలో 18వేల అడుగుల ఎత్తులో సైనికులు ఉన్నారని.. పైగా గడ్డకట్టిన మంచు, మరోవైపు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని.. దీంతో ప్రమాద సమయంలో ఆక్సిజన్ అందక సైనికులు చనిపోయినట్లు ఆర్మీ ప్రకటించింది. 

Tags:    

Similar News