పౌరసత్వ సవరణ చట్టంపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ‌్యలు చేశారు

Update: 2020-01-21 10:50 GMT
అమిత్ షా

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ‌్యలు చేశారు. దేశంలో ఏట్టి పరిస్థితుల్లో సీసీఏ అమలు చేస్తామని స్పష్టం చేశారు. నిరసనకారులు ఆందోళనలు పట్టించుకోమని వారి ఆందోళనలు కొనసాించుకోమని తేల్చిచెప్పారు.

లఖ్ నపూలో సీసీఏకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ.. దేశ విభజన అనంతరం హిందువులు, బౌద్ధుల ,సిక్కులు, సంఖ్య బంగ్లాదేశ్‌లో 30 శాతం‌, పాకిస్తాన్‌ 23 శాతంగా ఉండేదని అన్నారు. కానీ, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో 7శాతంగా, పాకిస్తాన్‌లో 3 శాతంగా ఉందని తెలిపారు. సీసీఏపై బహిరంగ చర్చకు రావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్ లో ఎందుకు ముస్లిమేతరుల సంఖ్య తగ్గిందో దేశ భక్తులు సమాధానం డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. పాక్ నుంచి అక్రమ వలసదారులు, ఉగ్రవాదులు దేశంలో దాడులు చేస్తుంటే మన్మోహన్ సింగ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు సీసీఏ తీసుకొచ్చాని తెలిపారు.‎ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షపార్టీలు కళ్లుమూసుకున్నాయని ఎద్దేవాచేశారు.

 

Tags:    

Similar News