ఆధార్ తోనే ఓటు:కోర్టులో పిటిషన్

Update: 2019-07-15 16:18 GMT

ఓటరు గురింపు కార్డును ఆధార్ తో అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలైంది. బీజేపీనేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ అధార్‌తోనే ఎన్నికలు జరగాలి అని కోరుతూ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రస్తుత ఎన్నికల వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండి, పారదర్శకత లోపించిందని పిటీషన్‌లో పేర్కొన్నారు.

ఆధార్ తోనే ఓటు:కోర్టులో పిటిషన్ఓటర్లను గుర్తించడం, ఆ సమాచారాన్ని భద్రపరచడం, వారికి గుర్తింపు కార్డుల మంజూరు చేయడం అనేవి ప్రస్తుత కాలంలో పెద్ద సవాళ్లుగా మారాయని ఆయన పేర్కొన్నారు. అందుకే ఒక రక్షణాత్మకమైన ఎన్నికల వ్యవస్థను తయారుచేసుకోవాలన్నారు. ఈ-ఓటింగ్‌ పద్ధతిని ప్రవేశపెట్టడం ద్వారా వేలిముద్రలు, ముఖకవళికల గుర్తింపుతో ఓటు వేయవచ్చునన్నారు. తద్వారా నకిలీ ఓటింగ్‌ను నిర్మూలించవచ్చునన్నారు. ప్రతి ఎన్నికల ముందు ఒకసారి ఈ ఓటర్ల సమాచారాన్ని క్రమబద్ధీకరిస్తే చాలునని ఆయన తన పిటీషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తే స్పందన లేదని అందుకే కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశానన్నారు. మంగళవారం కోర్టులో ఇది విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News