ప్రపంచ కప్ లో భాగంగా టీం ఇండియా బాగా రాణిస్తుంది. ఇటు బ్యాటింగ్ లోను అటు బౌలింగ్ లోను ఇండియా సత్తా చాటుతుంది . బ్యాటింగ్ లో రోహిత్ , రాహుల్ , కోహ్లి ,ధోని ఆకట్టుకుంటున్నారు . ఇక బౌలింగ్ లోను మహ్మద్ షమీ, బుమ్రా , కులదీప్ యాదవ్ , చాహల్ తమ సత్తా చాటుతున్నారు . అంతా బాగానే ఉన్నా హార్దిక్ పాండ్యా విషయంలోనూ చిక్కొచ్చి పడింది . బ్యాటింగ్ లో ఒకే అనిపించినా బౌలింగ్ లో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు .మిగతా బౌలర్లు బాగానే రాణిస్తున్న హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో మాత్రం బాట్స్ మెన్స్ పరుగులు రాబడుతున్నారు ..
ఈ నేపధ్యంలో పాక్ మాజీ బౌలర్ అబ్దుల్ రజాక్ హార్దిక్ పాండ్యాకు మెళుకువలు నేర్పించడానికి ముందుకు వచ్చాడు . పాండ్యా బౌలింగ్ లో లోపాలు ఉన్నాయని , ముఖ్యంగా అతని పుట్ వర్క్ మిస్ అవుతుందని , బౌలింగ్ లో కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయని వాటిని సరిద్దుకుంటే పాండ్యా అత్యుత్తమ అల్ రౌండర్ గా రుపుదిద్దుకుంటాడని రజాక్ అన్నాడు . పాండ్యాను ఒక రెండు వారలు తనకి వదిలేస్తే అత్యుత్తమ ఆటగాడిగా తీర్చిదిద్దుతానని అన్నారు ..
Abdul Razzaq "give me 2 weeks and I will make Hardik Pandya the world's best all-rounder" #Cricket pic.twitter.com/o3eIt69nfN
— Saj Sadiq (@Saj_PakPassion) June 27, 2019