అమ్మకోసం 650 కిలో మీటర్లు నడిచిన కొడుకు..ఎందుకంటే..

కరోనా వైరస్.. ఈ పేరు తలచుకుంటేనే ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బతుకున్నారు. ఈ మహమ్మారి కారణంగా ఒకరికి ఒకరిని కాకుండా చేస్తుంది.

Update: 2020-03-28 17:22 GMT
Man Starts walk from raipur to Varanasi

కరోనా వైరస్.. ఈ పేరు తలచుకుంటేనే ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బతుకున్నారు. ఈ మహమ్మారి కారణంగా ఒకరికి ఒకరిని కాకుండా చేస్తుంది. మనిషికి మనిషికి మధ్య దూరం పెంచి, మానవసంబంధాంలను తెంచేస్తుంది. అయిన వారు చనిపోతే కనీసం కడసారి చూపుకు కూడా నోచుకోకుండా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న ఓ తండ్రి చనిపోతే కొడుకు కడసారి చూపుకు నోచుకోలేక పోయాడు. ఇప్పుడ ఈ నేపథ్యంలోనే ఓ కొడుకు కన్న తల్లిని కడసారి చూసుకునే భాగ్యానికి నోచుకోకుండా చేస్తుంది. పలువురు సామాన్యులను కంటతడి పెట్టిస్తోంది. మనసును కలచి వేసే ఇలాంటి సంఘటనలు కరోనా వ్యాపించిన నాటి నుంచి ఎన్నో జరుగుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనాను కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. ఈ నేపధ్యంలోనే దేశంలో రవాణా వ్యవస్థ స్తంబించి పోయింది. దేశ సంరక్షణ కోసం ఈ చర్య అనివార్యమైనప్పటికీ ఎంతో మంది వలస కూలీలు కష్టాలను ఎదుర్కొంటున్నారు. బతుకు దెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వచ్చిన కూలీలు కాలినడకన స్వస్థలాలకు వెల్లిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ సంఘటన ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన వారిని కంట తడి పెట్టిస్తుంది.

పూర్తివివరాల్లోకెళితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన 25 ఏళ్ల మురకీం అనే పొట్టకూటికోసం ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌కు వచ్చి జీవనం సాగిస్తున్నాడు. కాగా మార్చి 25వ తేదిన తన తల్లి వారణాసిలో మరణించిందని తనకు కబురు వచ్చింది. కానీ దేశమంతటా లాక్ డౌన్ ఉన్న కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంబించిపోవడంతో అప్పటికప్పుడు అతను వెళ్లలేకపోయాడు. కానీ నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిన కనీసం చివరి సారిగా చూడాలన్న ధ్యేయంతో అతను రాయ్‌పూర్‌ నుంచి వారణాసికి 654 కిలో మీటర్లు దూరం ఉన్నప్పటికీ కాలినడకన వెళ్లడానికి సిద్దమయ్యాడు. తన ఇద్దరు స్నేహితులను తీసుకుని కన్న తల్లి కోసం ఎంత దూరమైనా అలసిపోకుండా నడకసాగిస్తున్నాడు.

అలా నడుస్తూ దారిలో ఏమైనా వాహనాలు కనిపిస్తే వాటిని ఆపి, లిఫ్ట్ అడుగుతూ ముందుకు వెళ్తున్నారు. ఈ విధంగా మూడు రోజుల వారి ప్రయాణంలో రోజుకు 100 కిలో మీటర్లు చొప్పున 350 కిలోమీటర్లు ప్రయాణించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బైకుంఠపూర్‌‌కు చేరుకున్నారు. అలా ప్రయాణిస్తున్న సమయంలో మీడియా వారిని గమనించి వాళ్లని పలకరించింది. దీంతో వారు తమలో దాచుకున్న బాధను వెలిబుచ్చారు. జన్మనిచ్చిన తల్లిని చివరి సారిగా చూడడానికి నడుస్తూ, లిఫ్ట్ అడుగుతూ ఇప్పటికే సగం దూరం చేరుకున్నామని తెలపారు. ఇలాగే ప్రయాణిస్తే మరో రెండు, మూడు రోజుల్లో వారణాసికి చేరుకుంటామని వారు చెప్పారు. దీంతో అక్కడున్న వారంతా కంటతడి పెట్టుకున్నారు.


Tags:    

Similar News