నచ్చిన కారు కొనివ్వలేదని కొత్త కారుని నదిలో తోసేశాడు...

Update: 2019-08-10 10:27 GMT

నచ్చిన కారును కొనివ్వలేదని కొత్త కారును నదిలోకి తోసేశాడు ఓ యువకుడు .. ఈ ఘటన హరియాణాలో చోటు చేసుకుంది . హరియాణాలోని ఓ వ్యాపారవేత్త తన కొడుకు అడిగిన జాగ్వర్‌ కారు కాకుండా బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చాడు . దీనితో అతను తన కోపాన్ని అ కొత్త కారుపై చూపించాడు . వెంటనే అ కారును తీసుకువెళ్లి నదిలోకి తోసేశాడు .అది నది మధ్యలో చిక్కుకుంది . వెంటనే తన కోపం నుండి బయటకు వచ్చిన అ యువకుడు అ కారును బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేసాడు . తనకి తోడుగా స్థానిక గజ ఈతగాళ్ల సహాయం తీసుకొని ఎట్టకేలకు కారును బయటకు తీసుకు వచ్చాడు . అయితే దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసారు ... 

Tags:    

Similar News