ఆస్కార్‌ అవార్డుల ప్రకటన.. ఉత్తమ సహాయనటిగా..

Update: 2019-02-25 03:52 GMT

అంత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ 2019 అవార్డుల ప్రకటన వెలువడింది. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం లాస్ ఏంజిల్స్ లో అట్టహాసంగా జరుగుతోంది. ప్రకటించిన అవార్డుల్లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా రోమా, బెస్ట్‌ డాక్యుమెంటరీగా ఫ్రీ సోలో అవార్డులు సొంతం చేసుకున్నాయి. ఉత్తమ సహాయ నటి అవార్డును రెజీనా కింగ్‌ అందుకున్నారు. ఉత్తమ సినీ ఎడిటింగ్‌ అవార్డును బెహిమన్‌ రస్పోడీ సొంతం చేసుకున్నారు. ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ చిత్రంగా స్పైడర్‌మ్యాన్‌ నిలిచింది. ఉత్తమ సహాయ నటుడి అవార్డును మార్షల్‌ అలీ దక్కించుకున్నాడు. గ్రీన్‌బుక్‌ సినిమాలో అతడి యాక్టింగ్‌కు అవార్డు దక్కింది.. 91వ ఆస్కార్‌ రేస్‌లో భారతీయ డాక్యుమెంటరీ కూడా కూడా అవార్డు సొంతం చేసుకుంది. పిరియడ్‌ అండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌ డాక్యుమెంటరీని నిర్మించిన‌ గునీత్‌ మోంగా ఆస్కార్‌ అవార్డును దక్కించుకున్నారు.

Similar News