టాయిలెట్‌ లోనే మూడేళ్లుగా ఆ వృద్ధురాలు నివాసం

మన దేశంలో ధనికులు ఇంకా ధనికులుగా, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు గానే ఉంటున్నారు అనడానికి ఈ సంఘటన ఓ చక్కటి ఉదాహరణగా

Update: 2019-12-10 14:58 GMT
Old women living in a toilet

మన దేశంలో ధనికులు ఇంకా ధనికులుగా, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు గానే ఉంటున్నారు అనడానికి ఈ సంఘటన ఓ చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రతి పెదవాడికి దుస్తులు , నీడ, ఆహారం తప్పనిసరి అని చాలా ప్రభుత్వాలు ఎన్నో పధకాలు తీసుకువచ్చాయి. కానీ, పధకాలు అందరికి అందడం లేదు. చాలా మంది సొంత ఇల్లులు లేకా పూరి గుడిసెల్లోనే నివసిస్తూ కాలం గడుపుతున్నారు.

అయితే ఒడిశాలోని ఓ 72 ఏళ్ల ద్రౌపతి బెహరా అనే గిరిజన మహిళఉండటానికి ఇల్లు లేక గత మూడేళ్ళుగా మరుగుదొడ్డిలో జీవిస్తుంది. అందులోనే పడుకుంటూ, అందులోనే వంట చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంది. సొంతవారు అంటూ ఆమెకి ఎవరూ లేకపోవడంతో ఆమెకి ఇలాంటి పరిస్థతి వచ్చింది. ఈ విషయంపై గ్రామ సర్పంచ్ ని అడగగా, ఆమెకి ఇల్లును కట్టించే స్తోమత తనకి, పంచాయితీకి కానీ లేదని, ఆమె బాధ తెలుసుకొని ప్రభుత్వం ఆదుకోవాలని చెబుతున్నాడు.

దేశంలో ఇలా నివసిస్తున్న వారి సంఖ్య చాలానే ఉంది. వారిని కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తుంచి వారికీ ప్రభుత్వ పధకాల ద్వారా వచ్చే ఇళ్ళను మంజూరు చేయలనీ నెటిజన్లు కోరుతున్నారు. 



Tags:    

Similar News