Chhattisgarh: పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు.. 6 నెలల పసికందు మృతి

Chhattisgarh: ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు డీఆర్‌జీ జవాన్లకు గాయాలు

Update: 2024-01-02 04:22 GMT

Chhattisgarh: పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు.. 6 నెలల పసికందు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో పోలీసులు- మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. గంగలూరు పోలీసు స్టేషన్‌ పరిధిలోని మాట్వాండిలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో ప్రమాదవశాత్తు మాట్వాండికి చెందిన ఆరు నెలల పసికందు మృతి చెందగా... తల్లి గాయాల పాలయ్యింది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి పోలీసులు సాయం అందించారు. ఎదురు కాల్పుల్లో పలువురు మావోలకు గాయాలయ్యాయి.

Tags:    

Similar News