Vijay Devarakonda: మహాకుంభమేళాలో విజయ్ దేవరకొండ...త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం
Vijay Devarakonda: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ప్రయాగ్ రాజ్ కు వెళ్లిన విజయ్ దేవరకొండ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. అనంతరం త్రివేణి సంగమంలో తన తల్లితో కలిసి పవిత్ర స్నానం ఆచరించారు. కాగా దీనికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతకుముందు విజయ్ ప్రయాగ్ రాజ్ వెళ్లేందుకు శనివారం హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు రాగా..విజయ్ ఎక్కిన ఫ్లైట్ సాంకేతిక సమస్యల కారణంగా 5గంటలపాటు ఆలస్యం అయ్యింది. ఇక విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. సీరియాడిక్ కథతో వస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథనాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నారు.