Rajendra Prasad: ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం..
Rajendra Prasad: ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్ల తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కూతురు గాయత్రి (38)మరణించారు.
Rajendra Prasad: ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం..
Rajendra Prasad: ప్రముఖ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కూతురు గాయత్రి (38) మరణించారు. శుక్రవారం గుండెపోటు రావడంతో ఆమెను హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్ కు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు.
కాగా రాజేంద్రప్రసాద్ కూతరు గాయత్రి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని రాజేంద్రప్రసాద్ స్వయంగా చెప్పారు. ఓ సినిమా ఈవెంట్లో కుమార్తె గురించి పలు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. అమ్మలేని వారు ..కూతురులో వారి అమ్మను చూసుకోవాలనుకుంటారు. తన పదేండ్ల వయస్సులో తన తల్లి మరణించిందని ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్. తాను కూడా తన కూతురిలో అమ్మను చూసుకుంటున్నారని..కానీ తనకు కూతరితో మాటలు లేవన్నారు. తన కూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందని చెప్పారు.
గత నెలలో రాజేంద్రప్రసాద్ సోదరుడు కూడా మరణించారు. విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. వీరభద్రస్వామి డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయంలో ఉద్యోగిగా ఉండేవారు.