వెంకీమామ సినిమా టీజర్ విడుదల...మామ,అల్లుడి జాతర
-వెంకీమామ సినిమా టీజర్ విడుదల -యాక్షన్‌తో పాటు సరదా సన్నివేశంగా వీడియో -ఆకట్టుకుంటున్న వెంకీమామ టీజర్ -విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న చిత్రం
విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కథనాయకులుగా నటిస్తున్న 'వెంకీమామ' సినిమా టీజర్ విడుదలయ్యింది. యాక్షన్‌తో పాటు సరదా సన్నివేశంగా రూపొందించిన ఈ వీడియో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. దసరా సందర్భంగా చిత్ర యూనిట్ ఈ టీజర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ ఫిల్మ్‌లో చైతన్య, రాశీఖన్నా, వెంకటేష్, పాయల్ రాజ్‌పుత్ జంటగా నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా సందడి చేయనుంది. దసరా సందర్భంగా విడుదల చేసిన ఈ టీజర్ కు వెంకటేష్, నాగచైతన్య అభిమానుల నుంచే కాకుండా సినీ ప్రేక్షకుల నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.