Betting Apps Case: రానా, మంచు లక్ష్మీ, విజయ్ దేవరకొండ సహా పలువురిపై కేసు నమోదు

Betting Apps Case: బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన పలువురు సినీ నటులపై హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో గురువారం కేసు నమోదైంది.

Update: 2025-03-20 05:58 GMT

Betting Apps Case: బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన పలువురు సినీ నటులపై హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో గురువారం కేసు నమోదైంది. సినీ నటులు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, మంచులక్ష్మి, ప్రణీత, యాంకర్లు శ్యామల, శ్రీముఖి, రీతూ చౌదరి, విష్ణుప్రియ తో పాటు మరికొంతమందిపై కేసులు నమోదయ్యాయి.

బీఎన్ఎస్ 318 (4), 112 ఆర్/డబ్ల్యు 49 బీఎన్ఎస్ సెక్షన్లు, గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3.3(ఏ), ఐటీ యాక్టులోని 66 డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారనే ఆరోపణలతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్లు సహా యాంకర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి 11 మందిని విచారణకు రావాలని మార్చి 19న పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ఆధారంగా కొందరు పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరయ్యారు.

బెట్టింగ్ యాప్స్‌నకు వ్యతిరేకంగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సే నో టూ బెట్టింగ్ యాప్స్ అనే క్యాంపెయిన్ ను స్టార్ట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ పై ఆశతో లక్షలు కోల్పోయి చాలా మంది ప్రాణాలు పోగోట్టుకున్నారని సజ్జనార్ గుర్తు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే వారి తీరుపై సోషల్ మీడియా వేదికగా సజ్జనార్ తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెబుతున్నారు. దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నవారిపై తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల ఫిర్యాదులు అందాయి. వీటి ఆధారంగా కేసులు నమోదయ్యాయి.

బెట్టింగ్ యాప్‌ల బారినపడి కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పోస్టు పెట్టారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరమని సజ్జనార్ చెబుతున్నారు. ఈ విషయమై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ పై అందిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

Tags:    

Similar News