The Raja SaabTalk: రాజాసాబ్‌కు మిక్స్డ్ టాక్‌.. మారుతి ఏమన్నాడంటే?

The Raja Saab Gets Mixed Talk :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ హారర్ కామెడీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Update: 2026-01-10 11:40 GMT

The Raja SaabTalk: రాజాసాబ్‌కు మిక్స్డ్ టాక్‌.. మారుతి ఏమన్నాడంటే?

The Raja Saab Gets Mixed Talk :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ హారర్ కామెడీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ కెరీర్‌లో ఇదే తొలి హారర్ కామెడీ సినిమా కావడం, అలాగే మారుతి తెరకెక్కించిన తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా విడుదలైన తొలి రోజు నుంచే మిక్స్డ్ టాక్ రావడంతో అభిమానుల్లో కొంత నిరాశ కనిపించింది.

ఈ నేపథ్యంలో చిత్ర బృందం బ్లాక్‌బస్టర్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రీమియర్ షోల విషయంలో మీడియాకు అసౌకర్యం కలిగిందని అంగీకరించిన ఆయన, “రాత్రి 1:30 గంటలకు షో ఏర్పాటు చేయడంతో అందరికీ ఇబ్బంది కలిగింది. ఆ కారణంగా రివ్యూలపై ప్రభావం పడింది. దీనికి మీడియా మిత్రులందరికీ క్షమాపణలు చెబుతున్నాను” అని అన్నారు.

ప్రభాస్ గురించి మాట్లాడుతూ మారుతి భావోద్వేగంగా స్పందించారు. “నాకొక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ప్రభాస్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఒక మిడ్‌రేంజ్ దర్శకుడితో సినిమా చేయడం అంత ఈజీ కాదు. తొమ్మిది నెలల్లో సినిమా చేసే నేను, ఈ సినిమాకోసం మూడు సంవత్సరాలు కష్టపడ్డాను. ప్రభాస్‌ను కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో, ప్రేక్షకులు ఆయనను ఎలా చూడాలనుకుంటున్నారో ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ ఈ సినిమా చేశాం” అని చెప్పారు.

సినిమా క్లైమాక్స్‌లోని 40 నిమిషాల ఎపిసోడ్‌కు మంచి స్పందన వస్తోందని మారుతి తెలిపారు. “ఇలాంటి మైండ్ గేమ్‌తో కూడిన కమర్షియల్ హీరో సినిమా ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై రాలేదు. కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులకు అర్థమవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఫస్ట్ షో లేదా ఫస్ట్ డే టాక్‌తోనే సినిమాను నిర్ణయించడం సరైంది కాదు. పది రోజులు ఆగితే అసలు ఫలితం తెలుస్తుంది” అని అన్నారు.

ట్రైలర్‌లో ప్రభాస్ ఓల్డ్ గెటప్ చూపించిన విషయం ప్రస్తావిస్తూ, థియేటర్‌కు వచ్చిన అభిమానులు ఆ గెటప్ కోసం ఎదురుచూశారని తెలిపారు. “ఆ డిజప్పాయింట్‌మెంట్ వల్ల కొందరు కథను పూర్తిగా ఆస్వాదించలేకపోయారు. ఈ విషయాన్ని చాలామంది అభిమానులు నాతో పంచుకున్నారు” అని అన్నారు.

అభిమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, నిర్మాతలతో చర్చించి సెకండ్ హాఫ్‌ను మరింత షార్ప్ చేసి, ప్రభాస్ ఓల్డ్ గెటప్‌ను శనివారం సాయంత్రం 6 గంటల షో నుంచి జోడించినట్లు మారుతి వెల్లడించారు. “ఎనిమిది నిమిషాల ప్రత్యేక ఎపిసోడ్‌లో ప్రభాస్ స్వాగ్, స్టైల్ పూర్తిగా కనిపిస్తుంది. రూఫ్ ఫైట్ సీక్వెన్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది” అని చెప్పారు.

చివరిగా మారుతి మాట్లాడుతూ, “ప్రభాస్ అభిమానులు పూర్తిగా డిజప్పాయింట్ కాలేదు, కానీ ఇంకా ఎక్కువ సంతృప్తి కోరుకుంటున్నారు. ఈ మార్పులతో ప్రేక్షకులు ఖచ్చితంగా హ్యాపీ అవుతారని నమ్ముతున్నాను. పండుగకు వచ్చిన అన్ని సినిమాలు బాగా ఆడాలి” అని అన్నారు.

ప్రభాస్ లాంటి స్టార్ కొత్త ప్రయత్నానికి ముందుకొచ్చినందుకు ఆనందంగా ఉందని, ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారని మారుతి తెలిపారు.

Tags:    

Similar News