The Raja Saab Day1 Collections: ప్రభాస్ స్టార్‌డమ్ మరోసారి రుజువు.. ‘రాజా సాబ్’ తొలి రోజు వసూళ్లు ఇవే!
రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన అపారమైన స్టార్ పవర్‌ను నిరూపించాడు. ఆయన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ మిక్స్‌డ్ నుంచి నెగటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ ఓపెనింగ్‌ను నమోదు చేసింది.
The Raja Saab Day1 Collections: ప్రభాస్ స్టార్‌డమ్ మరోసారి రుజువు.. ‘రాజా సాబ్’ తొలి రోజు వసూళ్లు ఇవే!
రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన అపారమైన స్టార్ పవర్‌ను నిరూపించాడు. ఆయన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ మిక్స్‌డ్ నుంచి నెగటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ ఓపెనింగ్‌ను నమోదు చేసింది. రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్ల గ్రాస్ దిశగా దూసుకెళ్లడం విశేషం.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది రాజా సాబ్’ భారత మార్కెట్‌లో తొలి రోజు సుమారు రూ.65 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో ప్రధాన వాటా తెలుగు రాష్ట్రాలదే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కనీసం రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రీమియర్ షోల ద్వారానే రూ.8 కోట్లకు మించి ఆదాయం రావడం మరో హైలైట్.
విదేశీ మార్కెట్లలోనూ ‘ది రాజా సాబ్’ మంచి ఓపెనింగ్‌ను అందుకుంది. ఓవర్సీస్‌లో రూ.25 నుంచి 30 కోట్ల మధ్య గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. దీంతో తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు రూ.90 కోట్ల మార్క్‌ను దాటినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల తుది లెక్కలు వెలువడితే రూ.100 కోట్ల క్లబ్‌ను తాకుతుందా లేదా అన్నది స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.
ముందస్తు బుకింగ్స్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు కావడం ప్రభాస్ క్రేజ్‌ను మరోసారి చాటుతోంది. భారత్‌లో టికెట్ బుకింగ్స్ మరింత ముందుగానే ప్రారంభించి ఉంటే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘కల్కి 2898 ఏడీ’, ‘సలార్’ స్థాయి అడ్వాన్స్ సేల్స్ కాకపోయినా, ఓపెనింగ్ డే వసూళ్లు మాత్రం బలంగా నమోదయ్యాయి.
క్రిటిక్స్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోయినా, తొలి రోజే ఈ స్థాయి వసూళ్లు సాధించడానికి ప్రభాస్ స్టార్‌డమ్‌నే ప్రధాన కారణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.