The Raja Saab AP Ticket Price Hike: రాజాసాబ్ ఊచకోత షురూ... ఏపీలో టికెట్ రేట్ల పెంపునకు సర్కార్ గ్రీన్ సిగ్నల్.. ప్రీమియర్ షో టికెట్ రూ.1000!

The Raja Saab AP Ticket Price Hike: ప్రభాస్ 'ది రాజాసాబ్' మూవీకి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధర రూ.1000గా నిర్ణయించగా.. మొదటి 10 రోజుల పాటు టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Update: 2026-01-07 14:35 GMT

The Raja Saab AP Ticket Price Hike: రాజాసాబ్ ఊచకోత షురూ... ఏపీలో టికెట్ రేట్ల పెంపునకు సర్కార్ గ్రీన్ సిగ్నల్.. ప్రీమియర్ షో టికెట్ రూ.1000!

The Raja Saab AP Ticket Price Hike: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వింటేజ్ లుక్‌తో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'ది రాజాసాబ్' బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడానికి సిద్ధమైంది. ఈ సినిమా విడుదలకు ముందే చిత్ర యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోలకు అనుమతినిస్తూ బుధవారం అధికారిక ఉత్తర్వులు (GO) జారీ చేసింది.

ప్రీమియర్ షోలకు భారీ ధర:

జనవరి 9న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, అంతకుముందే అంటే జనవరి 8 (గురువారం) సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు స్పెషల్ ప్రీమియర్ షోలు ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.

ఈ ప్రత్యేక షోల కోసం టికెట్ ధరను గరిష్టంగా రూ.1000 (GSTతో కలిపి) గా నిర్ణయించారు.

10 రోజుల పాటు పెరిగిన రేట్లు:

సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు (జనవరి 9 నుండి) సాధారణ షోల టికెట్ ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది:

సింగిల్ స్క్రీన్స్: ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.150 పెంచుకోవచ్చు.

మల్టీప్లెక్స్: ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.200 పెంచుకోవచ్చు.

షోల సంఖ్య: రోజుకు గరిష్టంగా 5 షోలు ప్రదర్శించుకోవడానికి అనుమతి లభించింది.

అంచనా ధరలు ఇలా ఉండవచ్చు:

ప్రభుత్వ అనుమతితో ఏపీలో టికెట్ ధరలు ఈ రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది:

మల్టీప్లెక్స్: రూ. 450 నుండి రూ. 550 వరకు.

సింగిల్ స్క్రీన్స్: రూ. 350 నుండి రూ. 400 వరకు.

మూవీ హైలైట్స్:

మారుతి దర్శకత్వంలో దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. హారర్ ఫాంటసీ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తుండగా, తమన్ సంగీతం అందించారు.

Tags:    

Similar News