Gorre Puranam: ఆసక్తికరంగా సుహాస్ ‘గొర్రె పురాణం’ ట్రైలర్
Suhas: మంచి కాన్సెప్ట్ కథలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్న హీరో సుహాస్. కలర్ ఫోటో చిత్రంతో హీరోగా తన ప్రస్థానం మొదలు పెట్టాడు.
Gorre Puranam: ఆసక్తికరంగా సుహాస్ ‘గొర్రె పురాణం’ ట్రైలర్
Suhas: మంచి కాన్సెప్ట్ కథలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్న హీరో సుహాస్. కలర్ ఫోటో చిత్రంతో హీరోగా తన ప్రస్థానం మొదలు పెట్టాడు. వరుసగా రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న విధానం లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ చిత్రం తో సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన నటించిన కొత్త సినిమా 'గొర్రె పురాణం' విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. తాజాగా చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఒక గ్రామంలో రెండు మతాల మధ్య ఒక గొర్రె ఎలా చిచ్చు పెట్టిందో ట్రైలర్‌తో హింట్ ఇచ్చారు. కోర్టు, కేసులు, గొడవలు ఇలా అన్నీ ఒక గొర్రె చుట్టూ సాగే ఎమోషనల్ డ్రామాగా సినిమా తెరకెక్కించారు.