Shraddha Kapoor: ఐటెం గర్ల్ గా మారబోతున్న శ్రద్ధాకపూర్

Shraddha Kapoor: "సలార్" సినిమాలో ఐటెం సాంగ్ కోసం ప్రభాస్ హీరోయిన్

Update: 2021-12-08 07:42 GMT

ఐటెం గర్ల్ గా మారబోతున్న శ్రద్ధాకపూర్ (ఫైల్-ఫోటో) 

Shraddha Kapoor: "రాధే శ్యామ్" తర్వాత త్వరలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "సలార్". కే జి ఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదలవుతుందని దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించేశారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు మరొకసారి రీషూట్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కోసం ఒక బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రభాస్ తో కలిసి స్టెప్పులు వేయబోతొందట. ఆమె మరెవరో కాదు శ్రద్ధాకపూర్.

ప్రభాస్ "సాహో" సినిమాలో హీరోయిన్ నటించిన శ్రద్ధ ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఐటెం గర్ల్ గా చేసేందుకు ఒప్పుకుందట. మొదట చిత్ర దర్శక నిర్మాతలు ఐటెం సాంగ్ కోసం "కే జి ఎఫ్" ఫేమ్ శ్రీనిధి శెట్టి ను అనుకున్నారట. కానీ శ్రద్ధ కపూర్ అయితే బాగుంటుందని ప్రభాస్ ఆమెని రికమండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే బాలీవుడ్లో ఒకటి రెండు సినిమాల్లో శ్రద్ధాకపూర్ ఐటెం సాంగ్ లో నటించింది. సాహో సినిమా కూడా తెలుగులో కంటే హిందీ లోనే బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అందుకే ప్యాన్ ఇండియన్ సినిమా కాబట్టి శ్రద్ధ కపూర్ అయితే బాలీవుడ్ ప్రేక్షకులు కూడా చూడటానికి ఆసక్తి చూపిస్తారని ప్రభాస్ ఆమె పేరు చెప్పినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News