Corona Awareness by RRR: అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి - ఆర్ఆర్ఆర్ టీం
Corona Awareness by RRR: కరోనా సెకండ్ వేవ్ తో దేశం విలవిల్లాడిపోతోంది. రోజురోజుకు భారీగానే కేసులు నమోదవుతున్నాయి.
కరోనాపై అవగాహన కల్పిస్తున్న ఆర్ఆర్ఆర్ టీం
Corona Awareness by RRR: కరోనా సెకండ్ వేవ్ తో దేశం విలవిల్లాడిపోతోంది. రోజురోజుకు భారీగానే కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది కోవిడ్ కారణంగా చనిపోతున్నారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయినా మార్పు కనిపించడంలేదు. మాస్కులు, శానిటైజర్లతోనే కరోనా మనకు వ్యాపించదని డాక్టర్లతో పాటు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా స్టార్స్ ఓ వీడియోతో నెట్టింట్లోకి వచ్చారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నడుంబిగించారు. హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగన్‌తో పాటు హీరోయిన్ అలియాభట్, దర్శకుడు రాజమౌళి పలు భారతీయ భాషల్లో అవగాహన కల్పించారు. మాస్క్, శానిటైజర్ లు వాడాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు యూట్యూబ్‌లో #StandTogether పేరుతో పంచుకుంది.
ఈ వీడియోలో ఆలియా భట్ తెలుగులో మాట్లాడగా.. రామ్‌చరణ్ తమిళం.. ఎన్టీఆర్ కన్నడ.. రాజమౌళి మలయాళం.. అజయ్‌దేవ్‌గణ్ హిందీలో మాట్లాడారు. ఈ వీడియోను మీరూ చూడండి.