RRR Actor Ray Stevenson: RRR సినిమా విలన్ రే స్టీవెన్‌సన్ కన్నుమూత
RRR Actor Ray Stevenson: అశోక షూటింగ్ లో స్టీవెన్‌సన్ కు గుండెపోటు
RRR Actor Ray Stevenson: RRR సినిమా విలన్ రే స్టీవెన్‌సన్ కన్నుమూత
RRR Actor Ray Stevenson: ఆర్ఆర్ఆర్ సినిమాతో భారత్ లో గుర్తింపు తెచ్చుకున్న బ్రిటీష్ నటుడు రే స్టీవెన్‌సన్ మృతి చెందారు. RRRలో స్కాట్ దొరగా రే స్టీవెన్‌సన్ నటించారు. అశోక షూటింగ్ లో స్టీవెన్‌సన్ కు గుండెపోటు వచ్చింది. దీంతొ ఇటలీలోని ఓ ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఐరిష్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన రే స్టీవెన్ సన్ నార్తర్న్ ఐర్లాండ్ లో 1964లోని మే 25న జన్మించారు. 1990ల్లో వచ్చిన టీవీ షోస్ ద్వారా నటుడిగా కెరీర్ ప్రారంభించారు. 2000లో హాలీవుడ్ సినిమాల్లో నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. స్టీవెన్ సన్ ప్రధాన పాత్రలో నటించిన మొదటి సినిమా కింగ్ ఆర్థర్. 2004లో వచ్చిన ఈ అడ్వెంచర్ సినిమాలో స్టీవెన్ సన్ ఆంటోని పాత్రలో నటించారు. స్టీవెన్ సన్ నటించిన అశోక సిరీస్ విడుదల కావాల్సి ఉంది. హాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా నటించి మెప్పించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో తన విలనిజంతో ఎంతగానో ఆకట్టుకున్నారు. స్టీవెన్ సన్ మృతి పట్ల RRR టీం సంతాపం వ్యక్తం చేసింది.