Ramya Krishna: మరో పవర్ ఫుల్ పాత్రలో శివగామి
Ramya Krishna: సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ లో శివగామి ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్
Ramya Krishna
Ramya Krishna: బాహుబలి రాజమాత శివగామి మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా దేవ కట్టా దర్శకత్వంలో 'రిపబ్లిక్' సినిమా రూపొందింది. భగవాన్ - పుల్లారావు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో సాయితేజ్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక రమ్యకృష్ణ రాజకీయ నాయకురాలుగా నటించింది. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని టాలీవుడ్ టాక్. రాజకీయ నాయకులకు బాధ్యత ఎక్కువ అని రమ్యకృష్ణ .. ప్రభుత్వ అధికారులకు అంతకు మించిన బాధ్యత ఉంటుందని సాయితేజ్ వ్యవహరించే తీరు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
ఇక రిపబ్లిక్ సినిమాలో సాయితేజ్ – రమ్యకృష్ణ మధ్య సన్నివేశాలు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని అంటున్నారు. అహంకారంతో కూడిన అధికారానికి .. బాధ్యతతో మెలిగే అధికారానికి మధ్య జరిగే పోరాటం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని ఫిలింనగర్ లో టాక్. తేజ్ సరసన ఐశ్వర్య రాజేశ్ నటిస్తుండగా ముఖ్యమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు. అలాగే మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ సినిమాకు రిపబ్లిక్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాను ఓటిటి లో రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర యూనిట్ నుండి అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాల్సిందే.