Rajendra Prasad: ఎర్రచందనం దొంగ హీరోనా.. వైరల్ అవుతున్న రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్

Rajendra Prasad Comments: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Update: 2024-12-10 11:00 GMT

Rajendra Prasad: ఎర్రచందనం దొంగ హీరోనా.. వైరల్ అవుతున్న రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్

Rajendra Prasad Comments: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన నటించిన వెబ్ సిరీస్ హరికథ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్.. ప్రస్తుత సినిమాలపై సంచలన కామెంట్స్ చేశారు.

ఈ కలియుగంలో వస్తున్న సినిమాలు, వాటి కథలను మీరు చూస్తున్నారు. నిన్న కాక మొన్న చూశాం. వాడెవరో చందనం దుంగల దొంగ.. వాడు హీరో. ఇటీవల హీరో పాత్రలకు అర్థాలు మారిపోతున్నాయి. నాకున్న అదృష్టం ఏమిటంటే.. నేను 48 ఏళ్లుగా సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్‌తోనే విలక్షణ హీరో అనిపించుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ పుష్ప2 ను ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప2 సినిమా గురించే చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోతమోగిస్తోంది. ఇక థియేటర్లలో అల్లు అర్జున్ యాక్షన్‌కు ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే చందనం దొంగ హీరోనా.. అని ఫ్లోలో అన్నారా..? లేదంటే కావాలనే అన్నారా..? అనేది తెలియాల్సి ఉంది.

ఇక హరికథ వెబ్ సిరీస్ ఈనెల 13 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మ్యాగీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో రాజేంద్ర ప్రసాద్‌తో పాటు హీరో శ్రీరామ్, పూజిత పొన్నాడ, దివి, అర్జున్ అంబటి, మౌనిక రెడ్డి తదితరులు నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. 

Tags:    

Similar News