RRR Movie: ఈసారి ప్రమోషన్ లను భిన్నంగా ప్లాన్ చేస్తున్న రాజమౌళి

RRR Movie: రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న అతిపెద్ద మల్టీస్టారర్ సినిమా "ఆర్ ఆర్ ఆర్".

Update: 2021-08-17 11:42 GMT

RRR Movie: ఈసారి ప్రమోషన్ లను భిన్నంగా ప్లాన్ చేస్తున్న రాజమౌళి

RRR Movie: రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న అతిపెద్ద మల్టీస్టారర్ సినిమా "ఆర్ ఆర్ ఆర్". జక్కన్న రాజమౌళి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. జులై 31న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని కరోనా కారణంగా అక్టోబర్ 31 కి వాయిదా వేశారు దర్శక నిర్మాతలు. అయితే తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ లో కూడా సినిమాని విడుదల చేసే అవకాశం లేదని ఈ సినిమాని మరింత వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. కొత్త రిలీజ్ డేట్ గురించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

మరోవైపు రాజమౌళి అభిమానులకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా సినిమా ప్రమోషన్ల పేరుతో సినిమా ఈవెంట్ లు చేసే పరిస్థితి లేదు కాబట్టి ప్రమోషన్లని రాజమౌళి ఈసారి విభిన్నంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి త్వరలో సినిమాకు సంబంధించిన ఒక డైలాగ్ టీజర్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల తో ఒక ఫ్రెండ్ షిప్ సాంగ్ కూడా త్వరలో విడుదల చేయబోతున్నారు దర్శకనిర్మాతలు.

Tags:    

Similar News