Pawan Kalyan: దటీజ్ పవర్ స్టార్..4గంటల్లోనే డబ్బింగ్ పూర్తి..!

Update: 2025-05-30 11:01 GMT

Pawan Kalyan: దటీజ్ పవర్ స్టార్..4గంటల్లోనే డబ్బింగ్ పూర్తి..!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ జూన్ 12 విడుదల కానున్న సంగతి తెలిసిందే. సరిగ్గా రెండు వారాల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ ఈ మూవీ పెండింగ్ మూవీస్ ను కంప్లీట్ చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. పగలు షూటింగ్ చేస్తూ..రాత్రి డబ్బింగ్ చెపుతూ..సినిమాల పట్ల తనకున్న అంకింత భావాన్ని చాటుకున్నారు. హరిహరవీరమల్లు కోసం నాలుగు గంటల్లోనే పవన్ డబ్బింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఇతర సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ షూటింగ్ ముగించిన తర్వాత రాత్రి 10గంటలకు డబ్బింగ్ ప్రారంబించి కేవలం 4గంటల్లోనే డబ్బింగ్ మొత్తం పూర్తి చేశారు.

పవర్ తుఫాన్ కు రెడీగా ఉండాల్సిందే. జూన్ 12న సినిమా థియేటర్లలో అడ్రినలిన్ తో నిండిన రైడ్ కోసం వేడి చూడండి అంటూ చిత్ర బ్రుందం ఎక్స్ లో తెలియజేసింది. పవన్ ఓజీ షూటింగ్ చేసి వచ్చి అర్థరాత్రి 2 గంటల వరకు ఏకధాటిగా డబ్బింగ్ చేసినట్లు సమాచారం. ఇది కదా మా పవర్ స్టార్ అంటే అని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ప్రేక్షకుల్లో బజ్ ను తీసుకువస్తుందని ఆశిస్తున్నారు. ఈ మూవీ నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతిక్రిష్ణ, క్రిష్ జాగర్లముడి సంయుక్తంగా మూవీని తెరకెక్కించారు.

ఈ చారిత్రక యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. 18వ శతాబ్దం నాటి కథాంశంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా హరిహర వీరమల్లు రూపొందుతోంది. బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనుండగా నాజర్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, ఆదిత్య మీనన్ , నోరా ఫతేహి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ టిక్కెట్టు అమ్మకాలు ఇప్పటికే విదేశాల్లో ప్రారంభమయ్యాయి. కానీ భారతదేశంలో ఇంకా మొదలు కాలేదు. స్టార్ట్ అయితే మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం ఖాయమనిపిస్తోంది.

Tags:    

Similar News