Bheemla Nayak: కంటెంట్ ఉన్నోడికి క్యాప్షన్ అవసరం లేదు.. పవర్ స్టార్ ఇస్ బ్యాక్

Update: 2021-08-15 06:12 GMT

భీమ్లా నాయక్ (ట్విట్టర్ ఫోటో)

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ తో మలయాళ సూపర్ హిట్ సినిమా "అయ్యప్పన్ కోశియమ్" రీమేక్ "భీమ్లా నాయక్" చిత్రంతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా "భీమ్లా నాయక్" యొక్క ఫస్ట్ గ్లిమ్పాస్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. "భీమ్లా నాయక్" గా పవన్ కళ్యాణ్ తన నటనతో డైలాగ్స్ తో దుమ్ములేపాడు. "వకీల్ సాబ్" సినిమాతో ఇప్పటికే మంచి హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 

రానా దగ్గుబాటి, పవన్ కళ్యాణ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించగా, సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుంది. ఇక పవన్ కళ్యాణ్ కి జోడిగా నిత్య మీనన్, రానా దగ్గుబాటికి జోడిగా ఐశ్వర్య కనిపించనున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Full View


Tags:    

Similar News