Minister Konda Surekha Comments: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎన్టీఆర్, నాని ఫైర్..మౌనంగా ఎలా ఉంటాము?
Minister Konda Surekha Comments: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో హీరోయిన్ సమంత,నాగచైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావిస్తూ మంత్రిగుండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలను సినీ ఇండస్ట్రీ ఒక్కటై ఖండించింది. నటీనటులు సోషల్ మీడియా వేదికగా వరుసగా పోస్టులు పెడుతూ ఫైర్ అవుతున్నారు.
Minister Konda Surekha Comments: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఎన్టీఆర్, నాని ఫైర్..మౌనంగా ఎలా ఉంటాము?
Minister Konda Surekha Comments: తెలంగాణ మంత్రి కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలతోపాటు సినీఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో తెలుగు సినీ ఇండస్ట్రీని రాకీయాల్లోకి లాగారు. ముఖ్యంగా సమంత, నాగచైతన్య, నాగార్జున పేర్లను ప్రస్తావించడం వారి పర్సనల్ విషయాలను మీడియా వేదికగా మాట్లాడటం వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే కొండా సురేఖ వ్యాఖ్యలను ఇప్పటికే అక్కినేని కుటుంబం, ఇటు సమంత తీవ్రంగా ఖండించారు. తాజాగా సురేఖ వ్యాఖ్యలపై సినీఇండస్ట్రీలోని కొంతమంది నటీనటులు స్పందించారు. వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అంటూ ఎన్టీఆర్ ఫైర్ అయ్యారు. ఆధారాల్లేని వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ ఎలా కూర్చుంటామంటూ హెచ్చరించారు. కొండా సురేఖ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని నాని మండిపడ్డారు.
కొండా సురేఖగారు వ్యక్తగత జీవితాలను బయటకు లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ప్రజాజీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించాలి. బాధ్యతారాహిత్యంగా సినీఇండస్ట్రీపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగానే చాలా బాధాకరం. ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చునేది లేదు. ఒకరినొకరు గౌరవించుకోవడం పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితం లేవతెత్తాం అంటూ ఎన్టీఆర్ ఫైర్ అయ్యారు.
రాజకీయ నాయకులు ఇష్టంవచ్చినట్లుగా, అర్థంపర్ధం లేని వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడటం చూస్తుంటే అసహ్యంగా ఉంది. బాధ్యత లేకుండా మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే..మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా అనిపిసోతోందా. ఇది కేవలం సినిమా నటులు, చిత్ర పరిశ్రమ, రాజకీయపార్టీకి సంబంధించిన అంశం కాదు..గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి ఆరోపణులు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని హీరో నాని అన్నారు.