'మహర్షి' సినిమాకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు

Update: 2019-05-07 13:29 GMT

మహర్షి సినిమాకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈ సినిమాకు 5 షోలకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి రాజీవ్‌ త్రివేది మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు. నిర్మాత దిల్‌ రాజు అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 9వ తేదీ నుంచి మే 22వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రమంతటా ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య సమయంలో అదనపు షోలకు అనుమతి లభించింది.

అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో టికెట్ల రేట్లను 2 వారాల పాటు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మహర్షి సినిమా ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు, అశ్విని దత్, పొట్లూరి వరప్రసాద్ నిర్మించారు. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించాడు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్‌, జయసుథ, మీనాక్షి దీక్షిత్‌, రాజేంద్రప్రసాద్‌, ముఖేష్‌ రుషి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు

Similar News