Kubera Movie: కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను షేర్ చేసిన టీమ్..

తమిళ నటుడు ధనుష్ కథనాయకుడిగా రూపొందుతున్న తాజా చిత్రం కుబేర. ఈ మూవీలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండగా.. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Update: 2025-02-27 07:45 GMT

కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను షేర్ చేసిన టీమ్..

Kubera Movie: తమిళ నటుడు ధనుష్ కథనాయకుడిగా రూపొందుతున్న తాజా చిత్రం కుబేర. ఈ మూవీలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండగా.. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఇప్పటికే మూవీ నుంచి వరుస అప్‌డేట్‌లను పంచుకున్న చిత్రబృందం తాజాగా విడుదల తేదీని తెలుపుతూ ఓ ఆసక్తికర పోస్టర్‌ను షేర్ చేసింది.

ఈ సినిమా జూన్ 20న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. పోస్టర్‌లో ధనుష్, నాగార్జున ఎదురెదురుగా ఉండగా మధ్యలో బాలీవుడ్ నటుడు జిమ్ షర్బ్ కనిపిస్తున్నారు. ఇదొక భిన్నమైన సోషల్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్నట్టు అర్థమవుతోంది. ఇందులో ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నారు. నాగార్జున ఈడీ అధికారి పాత్ర పోషిస్తున్నట్టు టాక్.

మూవీ రిలీజ్ విషయాన్ని కుబేర అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. పవర్‌కు సంబంధించిన స్టోరీ.. సంపద కోసం జరిగే యుద్ధం.. విధి ఆడించే ఆట.. శేఖర్ కమ్ముల కుబేర అత్యద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి జూన్ 20న రాబోతోంది అనే క్యాప్షన్‌తో మేకర్స్ ఈ విషయం తెలిపారు. అటు రష్మిక మందన్నా కూడా రిలీజ్ డేట్ గురించి ట్వీట్ చేశారు.

ఇప్పటి వరకు హ్యాపీ డేస్, ఆనంద్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లాంటి యూత్ ఫుల్ స్టోరీస్‌తో వచ్చిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. తొలిసారి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు కుబేర గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. అంతేకాదు ఏకంగా ధనుష్, నాగార్జున, రష్మికలాంటి పెద్ద నటీనటులతోనూ శేఖర్ కమ్ముల తొలిసారి పెద్ద ప్రయోగమే చేయబోతున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌లో సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు.

రష్మిక నటించిన వరుస సినిమాలు హిట్ అవుతున్న నేపథ్యంలో కుబేరపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అగ్ర కథానాయకులు నాగార్జున, ధనుష్ నటిస్తుండడం, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తుండడంతో ఈ సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో రష్మిక పాత్ర గురించి గతంలో శేఖర్ కమ్ముల మాట్లాడారు. మీ పక్కింటి అమ్మాయిలా రష్మిక కనిపిస్తుందన్నారు. ఇప్పటి వరకు ధనుష్, రష్మిక కలిసి నటించడం చూడలేదు. ఇందులో వారి స్క్రీన్ ప్రజెన్స్ చాలా కొత్తగా ఉంటుందన్నారు శేఖర్ కమ్ముల. జూన్ 20న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి మరి.


Tags:    

Similar News