Kalyan Ram: కాకినాడలో మేనల్లుడి రెస్టారెంట్ ప్రారంభించిన కళ్యాణ్ రామ్
కాకినాడలో ‘ఉదయ్ కేఫ్’ పేరుతో ప్రారంభమైన తన మేనల్లుడి రెస్టారెంట్‌ను నందమూరి కళ్యాణ్ రామ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Kalyan Ram: కాకినాడలో మేనల్లుడి రెస్టారెంట్ ప్రారంభించిన కళ్యాణ్ రామ్
కాకినాడలో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. తన మేనల్లుడు ప్రారంభించిన రెస్టారెంట్ ఓపెనింగ్ కోసం ఆయన కాకినాడకు వెళ్లారు. ‘ఉదయ్ కేఫ్’ పేరుతో ప్రారంభమైన ఈ రెస్టారెంట్‌ను నందమూరి కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించారు.
సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్, తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవల ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన, ప్రస్తుతం పలు కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘బింబిసార’ సినిమాకు ఘన విజయం దక్కడంతో దానికి సీక్వెల్‌గా ‘బింబిసార 2’ను కూడా తెరకెక్కిస్తున్నారు.
ఇదే కాకుండా శ్రీకాంత్ విస్సా దర్శకత్వంలో మరో యాక్షన్ సినిమాకు కూడా కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కుటుంబ కార్యక్రమంగా మేనల్లుడి రెస్టారెంట్ ఓపెనింగ్‌లో పాల్గొన్న కళ్యాణ్ రామ్ సందడి చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.