Jananayagan: ఒక్క సినిమాకు 275 కోట్లు.. ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా విజయ్ రికార్డ్..!
Jananayagan: దళపతి విజయ్ సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ నటిస్తున్న ఆఖరి చిత్రం 'జననాయగన్' (Jananayagan) ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Jananayagan: ఒక్క సినిమాకు 275 కోట్లు.. ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా విజయ్ రికార్డ్..!
Jananayagan: దళపతి విజయ్ సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ నటిస్తున్న ఆఖరి చిత్రం 'జననాయగన్' (Jananayagan) ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు హెచ్. వినోద్ ఈ సినిమాను ఒక పక్కా పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్రమోట్ చేసినప్పటికీ, ట్రైలర్ విడుదలయ్యాక నెటిజన్ల నుండి భిన్నమైన స్పందన వస్తోంది.
భగవంత్ కేసరి రీమేక్?
ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఇది బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం 'భగవంత్ కేసరి'కి జిరాక్స్ కాపీ అని విమర్శిస్తున్నారు. బాలయ్య చూపించిన ఇంటెన్సిటీని విజయ్ మ్యాచ్ చేయలేకపోతున్నాడని, కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే ఈ కథను ఎంచుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఒక స్టార్ హీరో ఆఖరి సినిమా ఇలాంటి కాపీ కథతో రావడంపై ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉన్నారు.
బడ్జెట్ లెక్కలు ఇవే.. విజయ్ రెమ్యునరేషన్ రికార్డు!
కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ ఈ సినిమా కోసం ఏకంగా రూ. 380 కోట్లు వెచ్చించింది. అయితే ఇందులో మేకింగ్ కంటే రెమ్యునరేషన్లకే ఎక్కువ ఖర్చయ్యిందని సమాచారం. దళపతి విజయ్ తన లాస్ట్ మూవీ కావడంతో ఏకంగా రూ. 220 కోట్లు పారితోషికం తీసుకున్నారట. అంటే మొత్తం బడ్జెట్‌లో దాదాపు 60% ఆయనకే దక్కింది. హెచ్. వినోద్ (దర్శకుడు) రూ. 25 కోట్లు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం కోసం రూ. 15 కోట్లు. బాబీ డియోల్ & పూజా హెగ్డే చెరో రూ. 5 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మమితా బైజు శ్రీలీల తరహా పాత్రలో నటిస్తున్న ఈ యంగ్ బ్యూటీకి రూ. 60 లక్షలు అందినట్లు తెలుస్తోంది. ఇతర ఖర్చులు ప్రొడక్షన్, సెట్స్ మరియు సీజీ వర్క్ కోసం మరో రూ. 100 కోట్లకు పైగా ఖర్చయినట్లు అంచనా.
పొలిటికల్ ఎంట్రీకి వేదిక?
విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి వెళ్తున్న తరుణంలో, ఈ సినిమాను తన పొలిటికల్ కెరీర్‌కు ఉపయోగపడేలా మలచుకున్నారని స్పష్టమవుతోంది. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తిరగరాస్తుందా? లేక కాపీ విమర్శలతో చతికిలబడుతుందా? అన్నది వేచి చూడాలి.