Jigris OTT: థియేటర్ల దగ్గర రచ్చ ఉంటే.. ఓటీటీలో జిగ్రిస్ ఊచకోత.. ‘జిగ్రిస్’ ఒక సెన్సేషన్!
Jigris OTT: Jigris OTT: తెలుగు సినీ చరిత్రలో ఒక చిన్న సినిమా ఈ స్థాయిలో సంచలనం సృష్టించడం ‘కలర్ ఫోటో’ తర్వాత మళ్ళీ ‘జిగ్రిస్’ చిత్రంతోనే సాధ్యమైంది.
Jigris OTT: థియేటర్ల దగ్గర రచ్చ ఉంటే.. ఓటీటీలో జిగ్రిస్ ఊచకోత.. ‘జిగ్రిస్’ ఒక సెన్సేషన్!
Jigris OTT: తెలుగు సినీ చరిత్రలో ఒక చిన్న సినిమా ఈ స్థాయిలో సంచలనం సృష్టించడం ‘కలర్ ఫోటో’ తర్వాత మళ్ళీ ‘జిగ్రిస్’ చిత్రంతోనే సాధ్యమైంది. హీరో కృష్ణ బురుగుల ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వైరల్ మ్యాన్ అయ్యారు.
సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు థియేటర్లలో ఉన్నా, ఓటీటీలో మాత్రం ‘జిగ్రిస్’ తన హవా కొనసాగిస్తోంది. రెండు మేజర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో నంబర్ 1 మరియు నంబర్ 2 పొజిషన్లలో ట్రెండ్ అవుతూ, ఈ చిత్రం ఒక రికార్డును నెలకొల్పింది.
కేవలం ఒక్క భాషలో మాత్రమే అందుబాటులో ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కృష్ణ బురుగుల నటనను చూసిన ప్రేక్షకులు "కార్తీక్ క్యారెక్టర్ లో జీవించేశావు అన్న" అంటూ మెసేజ్ లతో ముంచెత్తుతున్నారు.
ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ మరియు డైలాగ్ డెలివరీకి ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. యూత్ ఈయన్ని "ఓటీటీ స్టార్" గా కిరీటం కట్టేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘జిగ్రిస్’ క్లిప్స్, కృష్ణ నటనపై ప్రశంసలే కనిపిస్తున్నాయి. డల్లాస్ నుండి గల్లీ వరకు అందరూ ఇప్పుడు కృష్ణ బురుగుల గురించే మాట్లాడుకుంటున్నారు.