MAA Election 2021: మా ఎన్నికల్లో త్రిముఖ పోరు..?

MAA Election 2021: సీన్‌లోకి ఎంటర్ అయిన జీవితా రాజశేఖర్ * రాజుకుంటున్న రాజకీయం

Update: 2021-06-23 09:02 GMT

మా ఎలక్షన్స్ లో త్రిముక పోరు (ఫైల్ ఇమేజ్)

MAA Election 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు పొలిటికల్ రేంజ్‌లో ట్విస్టులు, టర్నింగ్‌ తిరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఓ వైపు ప్రకాశ్ రాజ్, మరోవైపు.. మంచు ఫ్యామిలీకి చెందిన హీరో మంచు విష్ణు రేసులో ఉన్నారు. ఇప్పుడు మరో పేరు జీవితారాజశేఖర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మా కార్యదర్శిగా కొనసాగుతున్న జీవితా రాజశేఖర్ అనూహ్య నిర్ణయం తీసుకుని మా ప్రెసిడెంట్ రేసులో నిలవబోతున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రకాశ్‌ రాజ్‌కు మెగా బ్రదర్ నాగబాబు మద్ధతు ప్రకటించారు. సెప్టెంబర్ లో జరగనున్న ఎన్నికల్లో ఆసక్తిగా మారింది. పెద్దస్టార్లు ఎవరికి మద్దతిస్తారు..? ఎవరు అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే ఈ ముగ్గురు పోరుకు సిద్ధమవుతుండడంతో పోటీ త్రిముఖ పోరుగా మారే అవకాశం ఉంది. మరోవైపు.. మెగా మద్దతు ఎవరికుంటే వారినే మా అధ్యక్ష పదవి వరిస్తుందనేది ఇండస్ట్రీలో ఒక టాక్‌ ఉంది. పోటీలో ఉన్న వ్యక్తి దాదాపు మా అధ్యక్ష పీఠంపై కూర్చున్నట్టేననేది ఇప్పటికే తెలిసింది. అయితే.. ఈసారి జరగబోయే పోటీలో మెగా మద్దతు ఎవరికి ఉంటుందనేదే ఇప్పుడందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. 

Tags:    

Similar News