Allu Arjun: అల్లు అర్జున్ కారణంగా 15 రోజులు తిండి తినలేదు..బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

Hari Teja: బుల్లితెరపై యాంకర్‌గా ప్రస్థానాన్ని మొదలుపెట్టి, వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి హరితేజ.

Update: 2026-03-01 08:00 GMT

Allu Arjun: అల్లు అర్జున్ కారణంగా 15 రోజులు తిండి తినలేదు..బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

Hari Teja: బుల్లితెరపై యాంకర్‌గా ప్రస్థానాన్ని మొదలుపెట్టి, వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి హరితేజ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న ‘డీజే’ (దువ్వాడ జగన్నాథమ్) షూటింగ్ విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ ఆమె చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

అల్లు అర్జున్ లాంటి స్టైలిష్ స్టార్ పక్కన నటిస్తున్నప్పుడు స్క్రీన్ మీద పర్ఫెక్ట్‌గా కనిపించాలని ఏ నటికైనా ఉంటుంది. హరితేజ కూడా అదే భావించారు. ‘డీజే’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు, బన్నీ పక్కన కాస్త స్లిమ్‌గా, అందంగా కనిపించాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఏకంగా 15 రోజుల పాటు కేవలం లిక్విడ్ డైట్ (ద్రవాహారం) మాత్రమే తీసుకున్నారట. ఒక నటిగా తన పాత్ర పట్ల ఆమెకు ఉన్న అంకితభావానికి ఇది నిదర్శనం.

డైట్ చేసి కష్టపడి సెట్‌లోకి అడుగుపెట్టిన హరితేజకు అల్లు అర్జున్ రూపంలో ఒక మధురమైన సర్ప్రైజ్ ఎదురైంది. అప్పటికే హరితేజ బిగ్‌బాస్ తొలి సీజన్‌లో తన పెర్ఫార్మెన్స్‌తో అందరినీ మెప్పించారు. షూటింగ్ సమయంలో బన్నీ స్వయంగా హరితేజ దగ్గరకు వచ్చి.. "బిగ్‌బాస్‌లో నీ ఆట తీరు, మాట తీరు చాలా బాగున్నాయి.. బాగా ఆడావు" అంటూ ప్రశంసించారట.

సాధారణంగా ఒక స్టార్ హీరో తన బిజీ షెడ్యూల్‌లో కూడా చిన్న కళాకారుల పనిని గమనించి, స్వయంగా వచ్చి అభినందించడం అంటే అది మామూలు విషయం కాదు. బన్నీ చేసిన ఆ పనికి హరితేజ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఒక పెద్ద స్టార్ నా పనిని గుర్తుంచుకుని మెచ్చుకోవడం నాకు దక్కిన అతిపెద్ద ప్రోత్సాహం అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’తో మొదలైన ప్రయాణం, త్రివిక్రమ్ దర్శకత్వంలోని ‘అ ఆ’ చిత్రంలో 'మంగమ్మ' పాత్రతో మలుపు తిరిగింది. ఆ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.బిగ్‌బాస్ తెలుగు సీజన్-1లో ఫైనలిస్ట్‌గా నిలిచిన హరితేజ, తన 'హరికథ'తో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. నటిగానే కాకుండా నిష్ణాతురాలైన కూచిపూడి నృత్యకారిణిగా కూడా ఆమెకు మంచి గుర్తింపు ఉంది.ప్రస్తుతం హరితేజ సినిమాలు, టీవీ షోలు ,సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. కష్టపడే తత్వం, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవచ్చని హరితేజ మరోసారి నిరూపించారు.

Tags:    

Similar News