Hari Hara Veera Mallu: మల్టీప్లెక్స్ ప్రీమియర్‌ల్లోనూ వీరమల్లు దుమ్మురేపుతున్నాడు

పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మొదటి ప్రదర్శనకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో కొన్ని గంటల్లో ఈ చిత్రానికి తొలి షో ప్రారంభం కానుంది.

Update: 2025-07-23 14:43 GMT

హరిహర వీరమల్లు: మల్టీప్లెక్స్ ప్రీమియర్‌ల్లోనూ వీరమల్లు దుమ్మురేపుతున్నాడు

పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మొదటి ప్రదర్శనకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో కొన్ని గంటల్లో ఈ చిత్రానికి తొలి షో ప్రారంభం కానుంది. హైదరాబాద్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాత్రి 9 గంటల 36 నిమిషాలకు ప్రత్యేక ప్రదర్శనలు ప్లాన్ చేశారు. ఈ స్పెషల్ షోలకు టికెట్ రేట్లు 700 రూపాయల వరకు ఉన్నా, ప్రేక్షకులు ఎటువంటి వెనకడుగు వేయకుండా టికెట్లు సెకన్లలోనే బుక్ చేసేస్తున్నారు.

ముందుగా హైదరాబాద్‌లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ చేయగా, అవి క్షణాల్లోనే హౌస్‌ఫుల్ అయ్యాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మల్టీప్లెక్స్‌లు షోలను యాడ్ చేస్తున్న కొద్దీ, అవి కూడా వేగంగా హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ప్రారంభ వసూళ్ల పరంగా హరిహర వీరమల్లు ఘనమైన ఆరంభం నమోదు చేయనుంది.

కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ ప్రేక్షకులంతా ఈ చిత్రాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News