Pawan Kalyan: హరిహరి వీరమల్లుకు, బాహుబలికి మధ్య ఉన్న సంబంధం ఏంటి.?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Pawan Kalyan: హరిహరి వీరమల్లుకు, బాహుబలికి మధ్య ఉన్న సంబంధం ఏంటి.?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 12న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏ ఎమ్. రత్నం ఎంతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ కథనానికి ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో, మొఘల్ కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ నడవనుందని సమాచారం. పవన్ కళ్యాణ్ ఇందులో ఒక స్వాతంత్ర సమరయోధుడి పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటించగా, ముఖ్య విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కనిపించనున్నాడు. మొఘల్ సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషించే బాబీ పాత్రకు సంబంధించిన గెటప్, డైలాగ్స్ ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తిని పెంచాయి.
ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాహుబలి-1 ఎలా బాహుబలి-2 కోసం ఆసక్తిని కలిగించే సస్పెన్స్‌తో ముగిసిందో, ఇదే విధంగా 'హరిహర వీరమల్లు' మొదటి భాగం కూడా ప్రేక్షకుల్లో భవిష్యత్తు పట్ల ఆసక్తిని కలిగించేలా ముగుస్తుందట. రెండో భాగానికి గట్టి లీడ్ ఇస్తూ, కథను ఓ కీలక మలుపులో ఆపనున్నారు. ఇలా వీరమల్లుకు బాహుబలితో లింక్ చేస్తున్నారు.
ఇక షూటింగ్ ఇప్పటికే పూర్తి కావడంతో, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విఎఫ్ఎక్స్, విజువల్ ట్రీట్మెంట్, గ్రాండియర్ లుక్‌ను మరింత మెరుగుపరిచే పనులు జోరుగా సాగుతున్నాయి.