Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చేస్తున్న గంగవ్వ.. కారణం అదేనా.?
Gangavva In Bigg Boss 8 Telugu: 'మై విలేజ్ షో' అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు పరిచయమైంది గంగవ్వ. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో ఏకంగా సినిమాల్లో నటించే అవకాశాలను కూడా సొంతం చేసుకుంది.
Bigg Boss 8 Telugu
Gangavva In Bigg Boss 8 Telugu: 'మై విలేజ్ షో' అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు పరిచయమైంది గంగవ్వ. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో ఏకంగా సినిమాల్లో నటించే అవకాశాలను కూడా సొంతం చేసుకుంది. ఇక బిగ్‌బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. గత సీజన్‌లో ఒకసారి షో పాల్గొనే ఛాన్స్ కొట్టేసిన గంగవ్వ.. అనారోగ్య సమస్యల కారణంగా మధ్యలోనే హౌజ్ నుంచి బయటకు వచ్చేశారు. ఇదిలా ఉంటే తాజాగా బిగ్‌బాస్ 8వ సీజన్‌లో మరోసారి హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ.
ఇక హౌజ్‌లోకి వచ్చినప్పటికీ నుంచి తనదైన శైలిలో హౌజ్‌లో హంగామా చేస్తోంది. నిన్నటి నిన్న హార్ట్ అటాక్ ప్రాంక్‌తో హౌజ్‌మేట్స్‌ను ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది. ఇదిలా ఉంటే గంగవ్వ ఈ వారం హౌజ్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎలిమినేషన్‌లో లేకపోయినా వాలంటరీగానే షో నుంచి ఆమె బయటకు రానున్నారని సమాచారం. గంగవ్వపై నమోదైన ఓ కేసు విషయంలో ఆమె బయటకు రానున్నారని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. 2022 లో గంగవ్వ, రాజు కలిసి ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానెల్ లో గంగవ్వ చిలుక పంచాంగం పేరుతో ఒక వీడియో చేశారు. ఈ వీడియోలో వాళ్లు ఓ చిలకను ఉపయోగించారు. దీంతో చిలుకను బంధించడంతో వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 షెడ్యూల్ IV కింద నేరమని స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ అనే వ్యక్తి జగిత్యాల అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఫిర్యాదును స్వీకరించిన అటవీశాఖ సిబ్బంది గంగవ్వతో పాటు యూట్యూబర్ రాజులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగానే ప్రస్తుతం గంగవ్వ హౌజ్ నుంచి బయటకు రానుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.