Devi Sri Prasad: హీరోగా దేవి శ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ గ్లింప్స్ విడుదల

Devi Sri Prasad: ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (DSP) తొలిసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Update: 2026-01-16 05:40 GMT

Devi Sri Prasad: హీరోగా దేవి శ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ గ్లింప్స్ విడుదల

Devi Sri Prasad: ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (DSP) తొలిసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘బలగం’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ సినిమాలో డీఎస్పీ కథానాయకుడిగా నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ గ్లింప్స్‌ను గురువారం చిత్రబృందం విడుదల చేసింది.

ఈ గ్లింప్స్‌లో ‘పర్షి’ అనే పాత్రలో దేవి శ్రీ ప్రసాద్‌ను పరిచయం చేశారు. పొడవాటి జుట్టు, గడ్డంతో, ఒంటిపై చొక్కా లేకుండా డప్పు వాయిస్తూ కనిపించిన డీఎస్పీ సరికొత్త లుక్‌తో ఆకట్టుకున్నారు. గాలికి ఊగుతున్న వేపాకులు, తుపాను వాతావరణం, మేక వంటి విజువల్స్‌తో గ్లింప్స్‌ను ఆధ్యాత్మికత, జానపద అంశాలతో రూపొందించారు.

ఈ చిత్రం జానపద నేపథ్యంతో కూడిన మ్యూజికల్ సోషల్ డ్రామాగా రూపొందుతున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా అందిస్తున్నారు. మ్యూజిక్ హక్కులను టీ-సిరీస్ సంస్థ సొంతం చేసుకుంది.

‘ఎల్లమ్మ’ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. గతంలో ఈ ప్రాజెక్ట్‌కు ఇతర హీరోల పేర్లు వినిపించినప్పటికీ, చివరికి దేవి శ్రీ ప్రసాద్‌కే కథానాయకుడిగా ఖరారైంది.

త్వరలోనే మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.


Full View

Tags:    

Similar News