Ram, Krithi Shetty Movie: వీరి మూవీ టైటిల్ ఫిక్స్....ఏంటో తెలుసా

Ram, Krithi Shetty Movie: రామ్ పోతినేని, లింగుసామి జోడీలో వస్తున్న సినిమాకు ఉస్తాద్ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.

Update: 2021-07-11 03:17 GMT

Krithi Shetty-Ram Pothineni:(The Hans India)

Ram, Krithi Shetty Movie: ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ ప్రేక్షకులకు దగ్గరైన రామ్.. తమిళ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా కు ఉస్తాద్  అనే టైటిల్ ఫిక్సి చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా ఈనెల 12 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ మొదలు పెట్టనుంది. ఇక ఈ సినిమా దర్శకుడు లింగుసామి విషయానికి వస్తే.. ఆయన గతంలో రన్, పందేంకోడి, ఆవారా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు.

లింగుసామి మాస్ చిత్రాలకు మన తెలుగులో కూడా మంచి ఆదరణ లభించింది. దీనితో ఈ కాంబో నుంచి సినిమా ప్రకటన రావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ భాషాల్లో ఏక కాలంలో బై లింగువల్ చిత్రంగా దీనిని రూపోందనుంది. ఈ సినిమాను ఎస్ ఎస్ స్క్రీన్స్ బ్యానర్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

Tags:    

Similar News