Tollywood: కరోనా సెకండ్ వేవ్ కలకలం..షూటింగ్‌లకు బ్రేక్

Tollywood: ఆర్టీస్ట్‌లకు సోకుతున్న కోవిడ్.. షూటింగ్‌లకు బ్రేక్.. సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నారు నిర్మాతలు.

Update: 2021-04-20 10:52 GMT

 కరోనా సెకండ్ వేవ్ టాలీవుడ్ 

Tollywood: టాలీవుడ్‌లో రెండు వారాల ముందు వరుస సక్సెస్‌లు, అన్ని కోట్లు, ఇన్ని కోట్లు అనే ప్రకటనలు చేశాయి. ఇప్పుడు యూ టర్న్ తీసుకుంది. సినిమా వాయిదాలు, థియేటర్ల మూసివేత అనే ప్రకటనలు వినిపిస్తోన్నాయి. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నుంచి బయటపడటానికి ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నారు సినీ పెద్దలు టాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా వీడడం లేదు. కోవిడ్ వల్ల లాక్‌డౌన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే ఇండస్ట్రీ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. లాక్‌డౌన్ ఎత్తేశాక మాములు పరిస్థితులు వచ్చాయిని సంతోషపడేలోపే కరోనా సెకండ్ వేవ్ టాలీవుడ్‌ని అతలాకుతలం చేసింది.

ఆఫ్టర్ లాక్‌డౌన్ తర్వాత రిలీజ్ అయిన చాలా సినిమాలు బెస్ట్ కలెక్షన్‌లను రాబట్టాయి. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. జాంబిరెడ్డి, ఉప్పెన, నాంది, జాతిరత్నాలు లాంటి సినిమా మంచి కలెక్షన్లు రాబట్టాయి. రీసెంట్ గా రిలీజైన వకీల్ సాబ్ కు కూడా దుమ్మురేపే కలెక్షన్లు వచ్చాయి.. సెకండ్ వేవ్ విజృంభించడంతో మళ్లీ సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. నాగచైతన్య లవ్ స్టోరీ, కంగనారనౌత్ తలైవీ, రానా విరాటపర్వం, నాని టక్ జగదీష్ సినిమాలు వాయిదా పడ్డాయి. చిరంజీవి ఆచార్య, వెంకటేష్ నారప్ప, బాలకృష్ణ అఖండ, రవితేజ ఖిలాడి, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి మరికొన్ని సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి. షెడ్యూల్ ప్రకారం విడుదల అవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

మరోవైపు.. ఆర్టీస్ట్‌లకు కరోనా సోకడంతో షూటింగ్‌లు బ్రేక్ పడుతున్నాయి. పెద్ద సినిమాలు వాయిదాలు పడటంతో.. చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. ఏపీలో టికెట్లు రేట్ల తగ్గింపు, సెకెండ్ వేవ్ కారణంగా ధియేటర్‌లలో సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గుతుండటంతో సినిమా హాళ్లు మూసివేస్తున్నారు..

ఇక థియేటర్లు నడిపేవారు మాత్రం 50 శాతం ఆక్యూపెన్సీతో షోలు ప్రదర్శించడానికి సిద్దమయ్యారు. ఇప్పుడే ఇలా ఉంటే ముందుముందు సినీ ఇండస్ట్రీ ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని సినీ పెద్దల్లో ఆందోళన మొదలైంది..



Tags:    

Similar News