Chiranjeevi: చిరంజీవికి సర్జరీ జరిగిందా? మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్..
‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రమోషన్లకు చిరంజీవి దూరంగా ఉండటంతో సర్జరీ చేయించుకున్నారనే టాక్ వైరల్ అవుతోంది. దీంతో మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Chiranjeevi: చిరంజీవికి సర్జరీ జరిగిందా? మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్..
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవికి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగంగా కొనసాగిస్తున్నారు.
అయితే, సినిమా ప్రమోషన్లలో చిరంజీవి పాల్గొనకపోవడం గమనార్హంగా మారింది. దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ నయనతార కలిసి వివిధ ప్రమోషనల్ వీడియోలు విడుదల చేస్తున్నప్పటికీ, వాటిలో మెగాస్టార్ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హీరో–డైరెక్టర్ మధ్య విభేదాలున్నాయా? లేక చిరంజీవి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అనే ప్రశ్నలు నెటిజన్లలో మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల సర్జరీ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న చిరంజీవి, తీవ్రమైన నొప్పి ఉన్నప్పటికీ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారని సమాచారం. షూటింగ్ పూర్తయ్యాక నొప్పి ఎక్కువ కావడంతో సర్జరీ చేయించుకున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ కారణంగానే చిరంజీవి ప్రస్తుతం అన్ని పబ్లిక్ కార్యక్రమాలు, ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నారని టాక్. అయితే, ఈ విషయాన్ని ఆయన టీమ్ అధికారికంగా వెల్లడించలేదు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియకపోయినా, ఈ వార్త తెలిసిన మెగా అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ వరుస అప్డేట్స్‌తో ప్రమోషన్స్‌ను కొనసాగిస్తున్నారు.