Ram Charan: రాంచరణ్, నిఖిల్ మూవీకి బాలీవుడ్ షాక్..

Ram Charan: గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాణ రంగంలోకి కూడా ప్రవేశించిన విషయం మనకు తెలిసిందే.

Update: 2023-05-29 13:30 GMT

Ram Charan: రాంచరణ్, నిఖిల్ మూవీకి బాలీవుడ్ షాక్..

Ram Charan: గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాణ రంగంలోకి కూడా ప్రవేశించిన విషయం మనకు తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను స్థాపించి తన తండ్రి, టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేశాడు. ఈ నిర్మాణ సంస్థ ఉండగానే యువీ క్రియేషన్స్ విక్రమ్ తో కలిసి చరణ్ 'వి' మెగా పిక్చర్స్ అంటూ మరో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ నుంచి మొదటి చిత్రంగా వీర్ సవర్కర్ బయోపిక్ ని రూపొందిస్తున్నారు.

యంగ్ హీరో నిఖిల్ ప్రధాన తారాగణంలో నూతన దర్శకుడు రామ్ వంశీకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఇండియా హౌస్ టైటిల్ ని ఖరారు చేయడమే కాకుండా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇండియన్ హౌస్ మూవీ అనౌన్స్ మెంట్ వీడియోకి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ రాగా బాలీవుడ్ నుంచి రాంచరణ్ కు ఊహించని షాక్ తగిలింది. అదేంటంటే, బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ రణదీప్ హుడా కూడా వీర్ సావర్కర్ కథతో ఓ సినిమా చేస్తున్నాడు.

రణదీప్ హుడా స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా సావర్కర్. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదలకు రానుండగా తాజాగా సావర్కర్ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి ఫీడ్రమ్ ఫైటర్స్ ను ప్రేరేపించిన గొప్ప నాయకుడు సావర్కర్..అలాంటి నాయకుడి కథని ఎవరు, ఎందుకు చంపేసారు అంటూ సావర్కర్ టీజర్ ను రణదీప్ ప్రెజెంట్ చేశాడు.

మరి, అటు రణదీప్ హుడా, ఇటు రాంచరణ్ ఇద్దరు ఒకే పాయింట్ తో రెండు సినిమాలు చేస్తున్నారు. మరి, రెండు సినిమాలు ఒకేలాగా ఉంటాయా లేక డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. మరి, ఈ విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News