Bigboss 9 Tamil: రెడ్ కార్డ్ షాక్! ఇద్దరు కంటెస్టెంట్లు అవుట్, ఆడియన్స్ హ్యాపీ.. ఎందుకంటే?

బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9లో అనుచిత ప్రవర్తనకు పాల్పడిన కమ్రుద్దీన్, వి.జె. పార్వతిలను హోస్ట్ విజయ్ సేతుపతి రెడ్ కార్డు చూపించి బయటకు పంపించారు.

Update: 2026-01-05 07:24 GMT

Bigboss 9 Tamil: రెడ్ కార్డ్ షాక్! ఇద్దరు కంటెస్టెంట్లు అవుట్, ఆడియన్స్ హ్యాపీ..

‘బిగ్ బాస్’ తమిళ్ సీజన్ 9లో అరుదైన పరిణామం చోటు చేసుకుంది. షోలో అనుచితంగా, హింసాత్మకంగా ప్రవర్తించిన ఇద్దరు కంటెస్టెంట్లు కమ్రుద్దీన్ మరియు వి.జె. పార్వతిపై కఠిన చర్యలు తీసుకున్నారు. షో హోస్ట్ విజయ్ సేతుపతి వీరిద్దరికీ రెడ్ కార్డు చూపించి, బిగ్ బాస్ హౌస్ నుంచి వెంటనే బయటకు పంపించారు.

టికెట్ టూ ఫైనలే టాస్క్‌లో భాగంగా నిర్వహించిన ఓ ఛాలెంజ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో ఎక్కువసేపు ఉండే కంటెస్టెంట్లకు పాయింట్లు ఇచ్చే టాస్క్‌లో, కమ్రుద్దీన్ ప్రవర్తన హద్దులు దాటింది. తోటి కంటెస్టెంట్ శాండ్రాను అనవసరంగా రెచ్చగొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సమయంలో వి.జె. పార్వతి కూడా కమ్రుద్దీన్‌కు మద్దతుగా నిలిచి, శాండ్రాపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ఒక దశలో మాటల దాడి శారీరక దాడిగా మారింది. కమ్రుద్దీన్, వి.జె. పార్వతి కలిసి శాండ్రాను బలవంతంగా కారు నుంచి బయటకు తోసేయడంతో ఆమె కిందపడిపోయింది. అనంతరం ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు లక్షణాలు కనిపించాయి. అయినప్పటికీ, ఈ పరిస్థితిని కూడా ఇద్దరూ తేలికగా తీసుకుంటూ వ్యాఖ్యలు చేయడం ప్రేక్షకుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.

ఈ ఘటనపై స్పందించిన హోస్ట్ విజయ్ సేతుపతి వీకెండ్ ఎపిసోడ్‌లో తీవ్రంగా మండిపడ్డారు. అనాగరిక ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేస్తూ, ఇద్దరికీ రెడ్ కార్డు చూపించారు. దీంతో కమ్రుద్దీన్, వి.జె. పార్వతి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.

ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రేక్షకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. షోలో క్రమశిక్షణ, మానవత్వానికి ప్రాధాన్యం ఇచ్చిన నిర్ణయమంటూ ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News