ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో బయటకు వచ్చిన విజయ్ దేవరకొండ హీరోయిన్ పేరు

Ananya Pandey - Drugs Case: డ్రగ్ రాకెట్ లో ఈమె పేరు కూడా బయటికి రావడం అందరినీ షాక్ కి గురి చేసింది...

Update: 2021-10-22 09:39 GMT

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో బయటకు వచ్చిన విజయ్ దేవరకొండ హీరోయిన్ పేరు

Ananya Pandey - Drugs Case: బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తనయుడు డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్లో కలకలం మొదలైంది. ఈ కేసును విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పుడు కొన్ని సంచలన విషయాలను వెలుగులోకి తెస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ కథానాయిక అనన్య పాండే పేరు కూడా బయటకు వచ్చింది. బాలీవుడ్ నటుడు చంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనన్య ఇప్పుడు తెలుగులో విజయ్ దేవరకొండ సరసన "లైగర్" సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. డ్రగ్ రాకెట్ లో ఈమె పేరు కూడా బయటికి రావడం అందరినీ షాక్ కి గురి చేసింది. వాట్సాప్ లో మాట్లాడుతూ ఆమె ఆర్యన్ తో డ్రగ్స్ గురించి చాట్ చేసినట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించి ఆమె ఇంటి పై దాడి చేసి విచారణకు పిలవడం జరిగింది.

దాదాపు రెండు గంటల పాటు అనన్య పాండే ని విచారించిన అధికారులు ఆర్యన్ ఖాన్ మరియు డ్రగ్స్ గురించి ఆరాతీసినట్లు సమాచారం. వాట్సాప్ లో మాట్లాడుకుంటూ ఆర్యన్ ఖాన్ తనకి గంజాయి కావాలి అని అడగగా అనన్య పాండే అరేంజ్ చేస్తాను అని సమాధానం ఇచ్చినట్లు ఎన్ సి బి అధికారులు గుర్తించారు. అయితే దీని గురించి ఆమెను అడగగా తాను జోక్ చేశానని, ఇప్పటిదాకా ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని, ఎవరికీ సరఫరా కూడా చేయలేదని చెప్పింది అనన్య. అయితే వాట్సాప్ చాట్ తప్ప అనన్య ఆర్యన్ కు డ్రగ్స్ పంపినట్లు ఎటువంటి సాక్ష్యాలు లేవు. ఇక ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.

Tags:    

Similar News