రష్యాలో విడుదల కి సిద్ధమవుతున్న అల్లు అర్జున్ సినిమా

*రష్యాలో తన సినిమాని విడుదల చేయనున్న అల్లు అర్జున్

Update: 2022-11-21 03:20 GMT

రష్యాలో విడుదల కి సిద్ధమవుతున్న అల్లు అర్జున్ సినిమా

Allu Arjun: ఈమధ్య ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాల హవా బాగానే నడుస్తోంది. బాహుబలి సినిమాతో ప్రపంచమంతా ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీని చూడటం మొదలుపెట్టింది. ఆ తర్వాత "ఆర్ఆర్ఆర్" వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో టాలీవుడ్ పై ఉన్న క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూ వచ్చింది. తాజాగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన "పుష్ప: ది రైజ్" కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. భారతదేశంలో మంచి కలెక్షన్లు నమోదు చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యనే మాస్కో ఫిలిం ఫెస్టివల్ వారు ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల జాబితాలో "పుష్ప: ది రైజ్" ని కూడా ఎంపిక చేసి ఆగస్ట్ 30న మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో సినిమాను స్క్రీన్ చేశారు. ఇక తాజాగా ఇప్పుడు ఈ సినిమా డిసెంబర్లో రష్యాలో కూడా విడుదల కావడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రష్యాలోని కొన్ని ప్రదేశాల్లో "పుష్ప: ది రైజ్" సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్యా కి పతనమవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి రెండవ భాగంగా విడుదల కాబోతున్న "పుష్ప: ది రూల్" పై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Tags:    

Similar News