Krithi Shetty: లైంగిక వేధింపులపై కృతిశెట్టి సంచలన కామెంట్స్.. ఏమన్నారంటే
Krithi Shetty Comments Me Too: సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమన్న కృతిశెట్టి.. బాధితులు అనుభవించిన మానసిక క్షోభను తలచుకుంటే భయమేస్తోందని చెప్పుకొచ్చింది.
Krithi Shetty
Krithi Shetty Comments Me Too: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని లైంగిక వేధింపుల అంశం ఓ కుదుపు కుదిపేస్తోంది. నిజానికి ఇలాంటి ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నా తాజాగా మలయాళ సినిమా ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ తర్వాత సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మలయాళ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లకు లైగింక వేధింపులు ఎదురయ్యాయయని ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌లో పేర్కొంది. దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ఇక తాజాగా టాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలతో ఇండస్ట్రీలో ఈ అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. జానీ మాస్టర్ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అంశంపై నటి కృతి శెట్టి స్పందించింది. సినీ రంగంలో జరుగుతోన్న పరిమాణాలపై కృతిశెట్టి ఆందోళన వ్యక్తం చేసింది.
సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమన్న కృతిశెట్టి.. బాధితులు అనుభవించిన మానసిక క్షోభను తలచుకుంటే భయమేస్తోందని చెప్పుకొచ్చింది. ఇలాంటి సంఘటనల గురించి ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేవారు ముందే తెలుసుకోవడం చాలా మంచిదని, అప్పుడు వారికి ఇండస్ట్రీ పట్ల ఓ అవగాహన ఏర్పడుతుందని కృతి అభిప్రాయపడింది. దీంతో భవిష్యత్తుల్లో సానుకూల మార్పులు వస్తాయని ఆమె చెప్పుకొచ్చింది.
ఇలాంటి విషయాలు తనను వ్యక్తిగతంగా చాలా డిస్టర్బ్ చేస్తాయన్న కృతిశెట్టి.. వేధింపుల వార్తలు విన్నప్పుడు ఆందోళన కలుగుతుందని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే మహిళలు ఆలోచించి అడుగులు వేయాలని ఆమె సలహా ఇచ్చింది. ఇదిలా ఉంటే కృతిశెట్టి ప్రస్తుతం తెలుగుతోపాటు పలు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ఈ క్రమంగానే తాజాగా నటించి 'ఏఆర్‌ఎమ్' మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైన కేవలం 4 రోజుల్లోనే రూ. 35 కోట్లు రాబట్టింది.