71st National Film Awards 2025: ఉత్తమ తెలుగు చిత్రం ‘భగవంత్ కేసరి’

71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను అవార్డు పొందిన చిత్రాల్లో తెలుగు చిత్రం ‘భగవంత్ కేసరి’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు.

Update: 2025-08-01 13:13 GMT

ఇక ఇతర విభాగాల్లో కూడా తెలుగు సినిమాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. విశేషంగా, ‘హను-మాన్‌’ చిత్రం ఉత్తమ యాక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ) విభాగంలో అవార్డు దక్కించుకోగా, ‘బలగం’ చిత్రంలోని “ఊరు పల్లెటూరు” పాటకు గానూ కాసర్ల శ్యామ్ ఉత్తమ గేయ రచయితగా ఎంపికయ్యారు.

ఇతర భాషా చిత్రాల్లో విజేతలు:

ఉత్తమ తమిళ చిత్రం: పార్కింగ్

ఉత్తమ చిత్ర విమర్శకుడు (Film Critic): ఉత్పల్ దత్త (అస్సామీ)

నాన్-ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో విజేతలు:

స్పెషల్ మెన్షన్ చిత్రాలు:

నేకల్: క్రానికల్ ఆఫ్ ప్యాడీ మ్యాన్‌ (మలయాళం)

ది సీ అండ్ సెవెన్ విలెజెస్‌ (ఒడియా)

ప్రధాన విభాగాలు:

ఉత్తమ స్క్రిప్ట్: సన్‌ ఫ్లవర్స్ వోర్ ది ఫస్ట్ వన్స్ టు నో (కన్నడ)

ఉత్తమ వాయిస్ ఓవర్: ది సేక్రెడ్ జాక్ - ఎక్స్‌ప్లోరింగ్ ది ట్రీస్ ఆఫ్ విషెస్ (ఇంగ్లీష్)

ఉత్తమ సంగీత దర్శకుడు: ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)

ఉత్తమ ఎడిటింగ్: మూవింగ్ ఫోకస్ (ఇంగ్లీష్)

ఉత్తమ సౌండ్ డిజైన్: దుందగిరి కే ఫూల్ (హిందీ)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళ్)

ఉత్తమ దర్శకుడు: ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)

ఉత్తమ కళా/సాంస్కృతిక చిత్రం: టైమ్‌లెస్ తమిళనాడు (ఇంగ్లీష్)

ఉత్తమ జీవిత చరిత్ర ఆధారిత చిత్రం:

మా బావు, మా గావ్ (ఒడిశా)

లెంటినో ఓవో: ఏ లైట్ ఆన్ ది ఈస్ట్రన్ హారిజాన్ (ఇంగ్లీష్)

ఉత్తమ పరిచయ దర్శకుడు: మావ్: ది స్పిరిట్ డ్రీమ్స్ ఆఫ్ చెరా (మిజో)

ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్: ప్లవరింగ్ మ్యాన్ (హిందీ)

ఈ ఏడాది కూడా తెలుగు చిత్రసీమ తన ప్రతిభను నిరూపించుకుంటూ పలు అవార్డులను సాధించి దక్షిణాది సినీ పరిశ్రమలో గౌరవాన్ని మరింత పెంచింది.

Tags:    

Similar News