Sammelanam Web Series Review: పుస్తకం చుట్టూ తిరిగే ప్రేమ కథ.. ఓటీటీలో సందడి చేస్తున్న నయా వెబ్ సిరీస్..!
Sammelanam Web Series Review: ఒకప్పుడు ప్రేక్షకులు థియేటర్లలో సినిమాల విడుదల కోసం ఎదురు చూసేవారు.
Sammelanam Web Series Review: పుస్తకం చుట్టూ తిరిగే ప్రేమ కథ.. ఓటీటీలో సందడి చేస్తున్న నయా మూవీ..!
Sammelanam Web Series Review: ఒకప్పుడు ప్రేక్షకులు థియేటర్లలో సినిమాల విడుదల కోసం ఎదురు చూసేవారు. కానీ ఎప్పుడైతే ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి. ఇందుకు అనుగుణంగానే మేకర్స్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లను తీసుకొస్తున్నారు. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లకు నేటితరం యువత అట్రాక్ట్ అవుతోంది. ఇందులో భాగంగానే తాజాగా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో ఓ కొత్త వెబ్ సిరీస్ సందడి చేస్తోంది. ఇంతకీ ఏంటా వెబ్ సిరీస్.? ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
సమ్మేళనం పేరుతో ఈటీవీ విన్‌లో కొత్త వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. గురువారం నుంచి ఈ వెబస్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ప్రియా వడ్లమాని, గానాదిత్య, బిందు, శివాంత్, శ్రీకాంత్, జీవన్ ప్రియ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. ఒక పుస్తకం చుట్టూ తిరిగే ప్రేమ కథగా వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు.
కథేంటంటే..
కాలేజీ రోజుల్లో జరిగిన సంఘటలను, తన ప్రేమ తాలూకు జ్ఞాపకాలను ఓ యువకుడు పుస్తకంలో రాసుకుంటాడు. అయితే కొన్ని కారణాలతో ఆ స్నేహితులు విడిపోతారు. అయితే ఆ స్నేహితులను యువకుడు రాసుకున్న పుస్తకం మళ్లీ కలుపుతుంది. అయితే వీరు కలుసుకోవడానికి ఆ పుస్తకం ఎలా సహాయపడింది.? అనేది తెలియాలంటే ఈ వెబ్ స్టోరీని చూడాల్సిందే.
ఈ సిరీస్‌లో ప్రియా వడ్లమాని, గానాదిత్య, విఘ్నయ్ అభిషేక్, బిందు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తరుణ్ మహదేవ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. సునయానీ, సాకేత్ సంయుక్తంగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ యూత్‌ను కచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.
రేటింగ్ 3/5